ఆర్ఆర్ఆర్.. 95వ ఆస్కార్ వేడుకలలో అవార్డు అందుకొని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ వరించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఓ స్పెషల్ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్.. 95వ ఆస్కార్ వేడుకలలో అవార్డు అందుకొని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ వరించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. పండగ చేసుకుంటున్నారు. కాగా.. ఆర్ఆర్ఆర్ టీమ్ పై దర్శకుడు రాజమౌళి, ఎంఎం కీరవాణి, చంద్రబోస్.. ఇలా ప్రతి ఒక్కరిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గురించి, నాటు నాటు సాంగ్ లో వారి ఎనర్జీ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు హాలీవుడ్ ఆడియెన్స్, ఫ్యాన్స్. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఓ స్పెషల్ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఆల్రెడీ ఆస్కార్ లో జరిగిన ప్రతి మూమెంట్ ని అందరూ టీవీలలో, ఓటిటిలలో, సోషల్ మీడియా పోస్టులలో చూసే ఉంటారు. కానీ.. అన్నింటికి మించి ఆస్కార్ అవార్డులు ముగిశాక జరిగిన పార్టీలో.. ఎన్టీఆర్, బ్లాక్ పాంథర్ నటుడు మైఖేల్ బి జోర్డాన్ తో కలిసి దిగిన పిక్ ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. బ్లాక్ పాంథర్ నటుడితో ఎన్టీఆర్ కనిపించేసరికి.. గతంలో వైరల్ అయిన కొన్ని వార్తలు, కథనాలు కూడా ఇప్పుడు మరోసారి చర్చల్లోకి వస్తున్నాయి. ప్రెజెంట్ ఎన్టీఆర్, బ్లాక్ పాంథర్ యాక్టర్ ఫోటోలను నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి.
అదికూడా మర్వెల్ స్టూడియోస్ వారి బ్లాక్ పాంథర్ లోనే నటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. ఆ మధ్యే ఎన్టీఆర్ బ్లాక్ పాంథర్ సిరీస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని మీమ్స్ లో కూడా వైరల్ చేశారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో బ్లాక్ పాంథర్.. దాదాపు ఇండియన్ ఎమోషన్స్ కి దగ్గరగా ఉంటుంది. అయితే.. అందులో ఏ రోల్ కైనా ఎన్టీఆర్ సూట్ అవుతాడని.. ఎన్టీఆర్ బ్లాక్ పాంథర్ ప్రపంచంలో అడుగుపెడితే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ బ్లాక్ పాంథర్ లో చేస్తాడో లేదోగానీ.. బ్లాక్ పాంథర్ యాక్టర్ తో ఫోటోలో కనిపించినందుకు ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. మరి మైఖేల్ బి జోర్డాన్ తో ఎన్టీఆర్ కనిపించడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.
NTR with Black Panther fame Michael B Jordan ❤️🐯 @tarak9999 @michaelb4jordan #GlobalStarNTRatOscars pic.twitter.com/lxYqu1IWVu
— JrNtr_Abhimani9999 (@abhimani9999) March 13, 2023