సినీ పరిశ్రమ మళ్లీ కన్నీరుపెట్టింది. రెండు రోజుల క్రితం మాస్టర్ శివశంకర్ మరణగాయం మాయకముందే మరో సినీ ప్రముఖుడు కన్నుమూశారు. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) మృతిచెందారు. 1955 మే 20న జన్మించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ నేతలు అశృనివాళులు అర్పిస్తున్నారు. తాజాగా సీతారామశాస్త్రి మరణంపై యన్టీఆర్ కన్నీటి పర్యంతం అయ్యారు.
‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి.’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
సిరివెన్నెల సుమారు 3 వేలకు పైగా పాటలు రాశారు. అదేవిధంగా 165కుపైగా చిత్రాలకు పూర్తిస్థాయిలో పాటలు రాశారు. మూడున్నర దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రచయితగా రాణించారు. ఆయన తన రచనలతో 2019లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. తన సినీజీవితంలో 11 నంది పురస్కారాలు కూడా అందుకున్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/O1fgNJEqau
— Jr NTR (@tarak9999) November 30, 2021