ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చలపతి రావు హఠాన్మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. చలపతి రావు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చలపతి రావుతో ఎంతో అనుబంధం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఫ్యామిలీతో వెకేషన్ కోసం అమెరికా వెళ్లారు. నేరుగా అక్కడినుంచి చలపతి రావు కుమారుడు రవిబాబుకు ఫోన్ చేశారు. బాబాయ్ ఎలా చనిపోయాడో అడిగి తెలుసుకున్నాడు.
వీడియో కాల్‌లోనే రవిబాబు ఎన్టీఆర్‌కు చలపతి రావు భౌతికదేహాన్ని చూపించారు. విగతజీవిగా మారిన చలపతి రావును చూస్తూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ‘లే బాబాయ్ లే’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. అనంతరం చలపతి రావు మృతిపై ఓ ట్వీట్ కూడా చేశారు. చలపతి రావు అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసిందని అన్నారు. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాత గారి రోజుల నుండి తమ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు మృతి తమ అందరికీ తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వీడియో కాల్‌లో చలపతి రావును చూస్తూ ఎమోషనల్ అయిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, చలపతి రావు గత కొన్ని నెలలుగా పూర్తిగా సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం తన కుమారుడి సినిమాలో ఓ పాత్ర చేశారు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత ఇలా కన్నుమూశారు. ఇక, ఆయన అంత్యక్రియలు అమెరికాలోని కుమార్తెలు వచ్చిన తర్వాతే జరగనున్నాయి. వారు వచ్చిన తర్వాత బుధవారం అంత్యక్రియలు జరగొచ్చు. మరి, చలపతి రావు భౌతిక దేహాన్ని చూస్తూ జూ. ఎన్టీఆర్ ఏడవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Stay Strong @tarak9999 anna 🥺♥️ pic.twitter.com/9gtYqzkIM8
— Dhanush 🧛 (@Always_kaNTRi) December 25, 2022