అభిమాన హీరోలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ధరించిన దుస్తులు, వాచెస్, యాక్ససరీస్ ని కొనుగోలు చేయాలి, అలాంటి ధరించాలని ఫ్యాన్స్ భావిస్తుంటారు. అందుకే అలాంటి వస్తువుల కోసం ఎక్కువగా నెట్టింట వెతుకుతుంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ధరించిన ఒక హుడీ గురించి అందరూ వెతుకులాట మొదలు పెట్టారు.
సాధారణంగా సినిమా హీరోలు, క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ కి అభిమానులు, ఫాలోవర్స్ ఉంటారు. వారి అభిమాన హీరో, క్రికెటర్ ఇలా సెలబ్రిటీలు ఏమైతే డ్రెస్సులు, వాచెస్, యాక్ససరీస్ ధరిస్తారో అలాంటివి తాము కూడా కొనుక్కోవాలని చూస్తుంటారు. అలాంటి వస్తువుల వివరాలు తెలుసుకునేందుకు ఎక్కువ తాపత్రయపడుతుంటారు. అలాగే ఇప్పుడు అభిమానుల్లో తారక్ ధరించిన హుడీ ఒకటి వైరల్ అవుతోంది. శుక్రవారం విశ్వక్ సేన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో తారక్ ఒక హుడీ ధరించాడు. ప్రస్తుతం ఆయన అభిమానులు మొత్తం ఆ హుడీ గురించే వెతుకులాట మొదలు పెట్టారు.
విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం శిల్పకళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక బ్లాక్ హుడీ ధరించి పాల్గొన్నాడు. ఆ హుడీపై బ్లాక్ అండ్ వైట్ షేడింగ్ లో మంటల డిజైన్ ఉంది. చూసేందుకు ఆ హుడీ ఎంతో యునీక్ గా కనిపించింది. బ్లాక్ కలర్ హుడీపై వైట్ కలర్ లో మంటలు వస్తున్నట్లుగా గ్రాఫిక్ ప్రింట్ ఉంది. ఇది బ్లాక్- ఆరెంజ్ కాంబో కలర్ వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ హుడీ ధర విషయానికి వస్తే.. ఇది ఓనిట్సుకా టైగర్ అనే వెబ్ సైట్ లో 170 యూరోస్ కి అందుబాటులో ఉంది. అంటే దాదాపుగా మన కరెన్సీలో రూ.15 వేలు వరకు ఉంటుంది.
ఇంక జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం గ్లోబల్ లెవల్లో తారక్ పేరు రీసౌండింగ్ వస్తోంది. రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకి వచ్చిన గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ దక్కించుకున్న తొలి ఇండియన్ సినిమాగా చరిత్ర పుటల్లో ఆర్ఆర్ఆర్ సినిమా పేరు మిగిలిపోతుంది. ఈ సినిమాకి ఆస్కార్ రావడం మాత్రమే కాదు.. హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ ల క్రేజ్ కూడా ప్రపంచవ్యాప్తం అయ్యింది. ఆస్కార్ అందుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశాడు.
వస్తున్నా 🔥5:49 PM #NTR30 #JrNTR @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/9Dq1y6MQBc
— Manu (@Manu_Tweetz) March 18, 2023