సెలబ్రీటిలకు అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ఎంతలా అంటే వాళ్లకు సంబంధించిన ప్రతి విషయం గురించి అభిమానులు తెలుసుకునేందుకు ఆసక్తిగా కనబరుస్తారు. సెలబ్రీటిలు వాడే కారు నుంచి ధరించే వస్తువుల వరకు ప్రతిదానిని అభిమానులు ఆసక్తిగా పరిశీలిస్తారు. అలానే తాజాగా యంగ్ టైగర్ యన్టీఆర్ ఓ కార్యక్రమంలో పెట్టుకున్న వాచ్ అభిమానుల కంటపడింది. అంతే ఇక ఆ వాచీ గురించి సెర్చింగ్ మొదలు పెట్టేశారు.తారక్ కి వాచీలు, కార్లు అంటే ఇష్టమని ఆయన అభిమానులు ఠక్కున చెప్తారు. యన్టీఆర్ కొత్త కార్లు,వాచీల గురించి అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తుంటాయి.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది. ఇక రాజమళి దెబ్బతో ఇంతకు ముందున్న రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇప్పటికీ కూడా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్ లతో రూ.1000 కోట్ల చేరువలో ఉంది.అలా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయం సొంత చేసుకుందో అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్ఆర్ ఆర్ టీమ్ తో ముంబయిలో ఓ పెద్ద పార్టీ జరిగింది. ఆ కార్యక్రమానికి యన్టీఆర్ పాల్గొన్నారు. అక్కడ తారక్ పెట్టుకున్న వాచ్ అభిమానులను ఆకట్టుకుంది. దీంతో ఆ వాచ్..ఏ కంపెనీ, ఎంత ఖరీదు అనే విషయాల గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు.
Wahhh @tarak9999 Anna💥💥💥#ManOfMassesNTR #NTR𓃵 @tarak9999 pic.twitter.com/npABRpbCPl
— 𝐍𝐓𝐑 𝐓𝐇𝐄 𝐂𝐎𝐍𝐐𝐔𝐄𝐑𝐎𝐑 🌊 (@NTR_d_CONQUEROR) April 6, 2022
చివరికి ఆ వాచ్ ఖరీదు తెలిసి తారక్ అభిమనాలు షాకయ్యారు. ఎందుకంటే ఆ వాచ్ ఖరీదు రూ.కోటిన్నర పైమాటే. ఆ వాచ్ పేరు Patek Philippe Nautilus 5712 1/A 08/2020. ధర రూ. 1.70 కోట్ల వరకు ఉంది. ధరను బట్టి అర్ధం చేసుకోవచ్చు అది ఎంత ప్రత్యేకమో.గతంలో కూడా తారక్ చేతికి ఇలాంటిదే కాస్ట్లీ వాచ్ ఒకటి కనిపించింది.మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.