Jani Master: నేషనల్ వైడ్ పాపులారిటీ ఉన్న కొరియోగ్రాపర్స్‌లో జానీ మాస్టర్ ఒకరు. ఈయన తన డ్యాన్స్‌తో పాటకు క్రేజ్ తెచ్చేస్తున్నారు. జానీ మాస్టర్ 2009లో వచ్చిన ద్రోణ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా మారారు. ఇక, అప్పటినుంచి వృత్తి పరంగా తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టీవీ షోలలో కూడా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 50కి పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. తాజాగా, ఆయన కొరియోగ్రఫీ చేసిన బీస్ట్, విక్రాంత్ రోణ, వారియర్, తిరు సినిమాల్లోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆయన దేశ వ్యాప్తంగా ఉన్న అందరు టాప్ హీరోలతో పని చేశారు. అయితే, జానీ మాస్టర్‌కు పవన్ కల్యాణ్ అంటే మొదటి నుంచి ఓ ప్రత్యేకమైన అభిమానం.
పవన్ కల్యాణ్‌తో సినిమా డైరెక్షన్ చేయాలని జానీ మాస్టర్ భావించారు. కానీ, అది కుదర్లేదు. ఇక, అవకాశం వచ్చినప్పుడల్లా జానీ మాస్టర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పవన్ కల్యాణ్‌తో దిగిన ఓ పాత ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది బాలు సినిమా షూటింగ్ టైంలోనిదిగా తెలుస్తోంది. ఆ ఫొటోలో జానీ మాస్టర్ గుర్తు పట్టలేనట్లుగా ఉన్నారు. చాలా సన్నగా కూడా ఉన్నారు. ఈ ఫొటోపై స్పందిస్తున్న పవన్, జానీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి, పవర్ స్టార్‌తో జానీ మాస్టర్ పాత ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Roja: వీడియో: దసరా స్పెషల్ ఈవెంట్ లో మంత్రి రోజాకి అవమానం!