తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ రూటే సపరేట్. విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నాడు. ఈ ఐకానిక్ స్టార్ యాక్టింగ్‌తోనే కాకుండా డ్యాన్స్‌లతోను ఇరగదిస్తాడు. దీంతో ఆయన దక్షిణాది వ్యాప్తంగా ఎనలేని అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక తాజాగా విడుదలైన ఈ మూవీ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. షూటింగ్ చివరి దశలో జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. ఇక విషయానికొస్తే..డైరెక్టర్ వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ హీరోగా ఐకానిక్ అనే మూవీ తెరకెక్కించేందుకు సిద్దంగా ఉన్నాడు. అయితే పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో ఎలాగైన సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్.
కాగా ఐకానిక్ మూవీలో హీరోయిన్ ఎవరన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీదేవి కూతురు అందాల బామ జాన్వీ కపూర్‌ను ఈ సినిమాలోకి హీరోయిన్‌గా తీసుకునేందుకు డైరెక్టర్ శ్రీరామ్ ఆలోచిస్తున్నాడట. అయితే ఇంత వరకూ తెలుగు సినిమాల్లో నటించని జాన్వీ ఈ అవకాశంతో టాలీవుడ్‌లో నటించేందుకు ఒప్పుకుంటాందా అనేది తెలియాల్సి ఉంది.