పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా హీరోలకు సామాన్యులు ఫ్యాన్స్‌గా ఉంటారు. కానీ పవన్‌కు మాత్రం హీరోలు కూడా ఫ్యాన్స్‌గా ఉంటారు. చాలా మంది హీరోలు పలు సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక పవర్ స్టార్ సినిమాలు విడుదల వేళ, మరీ ముఖ్యంగా ఆయన బర్త్‌డే రోజుల ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇక ఈ ఏడాది హీరోల బర్త్‌డే సందర్భంగా కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. వారి జీవితంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీలను మరో సారి థియేటర్‌లో విడుదల చేసి.. ఫ్యాన్స్‌ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా పవర్ స్టార్ బర్త్‌డే సందర్భంగా జల్సా సినిమా 4కేలో మరోసారి థియేటర్‌లో రీ రిలీజ్ చేశారు.సెప్టెంబర్ 1న స్పెషల్ షోలు వేశారు. మార్నింగ్ షో నుంచే విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో హీరో సాయి ధరమ్ తేజ్.. సంధ్య థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి జల్సా సినిమా చూశారు. ఓ మామూలు పవన్ కళ్యాణ్ అభిమానిలా.. మెడలో ఎర్ర కండువా వేసుకుని వచ్చిన తేజ్.. మధ్యలో లేచి పేపర్లు విసురుతూ.. ఓ రేంజ్‌లో రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.