Jabardasth Faima: బుల్లితెర కామెడీ షోలలో ‘జబర్థస్త్’ ఓ ట్రెండ్ సెట్టర్. ఈ షో ద్వారా ఎంతో మంది చిన్న నటులు గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొంత మంది స్టార్ కమెడియన్లుగా మారారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు షోలో లేడీ క్యారెక్టర్లను కూడా మగవాళ్లే చేసేవారు. తర్వాత తర్వాత ట్రెండ్ మారింది. షో ఆడవాళ్లు కూడా నటించటం మొదలుపెట్టారు. అయితే, అతి కొద్ది మంది మాత్రమే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ కొద్ది మందిలో ‘ఫైమా’ మొదటి స్థానంలో ఉంటారు. ఈమె అతి తక్కువ కాలంలో తన విలక్షణమైన నటనతో మంచి పాపులర్ అయ్యారు.
ఏ స్కిట్ చేసినా ఆ స్కిట్‌లో తళుక్కున మెరుస్తున్నారు. కేవలం నటతోనే కాదు.. తన ఎక్స్‌ట్రా టాలెంట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం ఫైమా తన పళ్లతో గ్యాసిలిండర్ ఎత్తిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు గ్యాసిలిండర్ ఎత్తిన ఆమె ఇప్పుడు పళ్లతో ఏకంగా స్కూటీనే ఎత్తేశారు. తాజాగా విడుదలైన ‘జబర్థస్త్’ ప్రోమోలో ఈ దృశ్యాలను మనం చూడొచ్చు. స్కిట్‌లో భాగంగా ఆమె తన పళ్లతో స్కూటీనీ ఎత్తేశారు. ఫైమా చూపించిన ఈ ఎక్స్‌ట్రా టాలెంట్ ప్రోమోలోనే హైలెట్‌గా నిలిచింది.
ఈ ప్రోమోలోని ఫైమా యాక్టింగ్ చూసిన నెటిజన్లు.. ‘‘ ఫైమా ఆసమ్ అసల్ ❣️’’.. ‘‘ ఫైమా కామెడి టైమింగ్ వేరే లెవల్ ఎంత మందికి ఇష్టం..సో ఫన్నీ .. ఫైమా వచ్చినప్పుడు నుంచి భాస్కర్ స్కిట్స్‌ను ఎంత మంది చుాస్తున్నారు.ఇష్టపడుతున్నారు’’.. ‘‘ ఫైమా యాక్టింగ్ వేరే లెవల్ అబ్బా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఫైమా ఎక్స్‌ట్రా టాలెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Rashmi Gautham: చూపు తిప్పుకోలేని అందాలతో కట్టిపడేస్తోన్న యాంకర్ రష్మీ! ఫొటోస్ వైరల్