యాంకర్ అనసూయ.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, చలాకీతనంతో పాటు.. నటన కలబోస్తే అనసూయ. ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ ప్రేక్షకులకు కనువిందు చేయడం ఈ అమ్మడి నైజం. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఆమె సత్తా చాటుతోంది. పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ఆ తర్వాత.. క్షణం, రంగస్థలం, యాత్ర, థ్యాంక్యూ బ్రదర్, ఖిలాడీ, పుష్ప సహా పలు సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు అనేక బుల్లితెర షోల్లో యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీగా మారింది. తాజాగా “పార్టీ చేద్దాం పుష్ప” అనే ప్రోగ్రాం లో హోస్ట్ గా వ్యవహరించింది. అంతేకాక అందమైన డ్రెస్స్ తో మాస్ డ్యాన్స్ చేసి కుర్రకారు మతిపొగొట్టింది. తాజాగా ఈ ప్రొగ్రాం కి సంబంధించన ప్రోమో విడుదలైంది.
అనసూయ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. తన అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. ఇక డ్యాన్స్ విషయంలో హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గను అన్నట్లు అనసూయ పర్ఫామెన్స్ ఉంటుంది. ముప్పై పదుల వయస్సులో కూడా తన అందంతో కుర్రకారు మనసులను దోచేస్తుంది ఈ అమ్మడు. తాజాగా “పార్టీ చెద్దాం పుష్ప” అనే ప్రోగ్రామ్ కి యాంకర్ వచ్చిన ఈ అమ్మడు.. ఓ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. అద్భుతమైన ఈ అవుట్ ఫిట్ తో అనసూయ వయసులో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. మీరు అనసూయ డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Video: కిరాక్ ఆర్పీకి నాగబాబు అంటే అంత అభిమానా…