కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ అనే కామెడీ షోతో తన కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతున్నాడు. కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసి.. కెరీర్లో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం కామెడీ స్టార్స్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కిరాక్ ఆర్పీ కామెడీతోనే కాదు.. అతని వ్యక్తిత్వం కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి నిహారికతో కలిసి మెగా బ్రదర్ నాగబాబు హాజరై.. ఆర్పీ జంటను ఆశీర్వదించారు. నాగబాబుతో ఆర్పీకి ఎంతో మంచి అనుబంధం ఉంది. జబర్దస్త్ సమయం నుంచే నాగబాబు.. ఆర్పీని ఎంతో బాగా సపోర్ట్ చేసేవారు. డాడీ.. డాడీ అంటూ నాగబాబుని ఆర్పీ ఎంతో ఆప్యాయంగా పిలవడం చూస్తుంటాం. అయితే చాలా మంది అది కేవలం కెమెరా ముందు చూపించే ప్రేమ మాత్రమే అనుకుంటారు. అయితే నాగబాబుపై ఆర్పీకి ఎంత అంభిమానం, గౌరవం, ప్రేమ ఉందో ‘పార్టీ చేద్దాం పుష్ప’ అనే కార్యక్రమంలో వెల్లడించాడు. ఏకంగా నాగబాబు పేరును ఆర్పీ తన గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. View this post on Instagram A post shared by Lakshmi Prasanna Lucky (@lucky_rp_999) నాగబాబుపై ఆర్పీకి ఎంత అభిమానం ఉందో వివరిస్తూ.. సుడిగాలి సుధీర్ ఆ పచ్చబొట్టును లైవ్ లో చూపించాడు. అది చూసి నాగబాబు కూడా ఎంతో ఆశ్చర్యపోతూ.. నాతో ఎప్పుడూ చెప్పలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ చేసిన పనికి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూనే.. జీవితంలో చేయందించిన వారిపై ఆ మాత్రం అభిమానం చూపించడంలో తప్పులేదంటూ కామెంట్ చేస్తున్నారు. మరి.. కిరాక్ ఆర్పీ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పండంటి బాబుకు జన్మనిచ్చిన నిర్మాత దిల్ రాజు భార్య! ఇది కూడా చదవండి: బెంజ్ కారు కొనుగోలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోలు వైరల్!