కొద్దిరోజుల క్రితం కార్తీక్ తనకు కాబోయే భార్య ఎవరో పరిచయం చేశాడు. అయితే, ఆమె ముఖాన్ని రివీల్ చేయకుండా దాచాడు. తాజాగా, ఆ సస్పెన్స్‌కు తెర దించాడు. కాబోయే భార్య ముఖాన్ని రివీల్ చేశాడు.
బజర్థస్త్ షోతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్ కెవ్వు కార్తీక్. మిమిక్రీ ఆర్టిస్ట్ కెరీర్ ప్రారంభించిన కెవ్వు కార్తీక్ ప్రస్తుతం కమెడియన్‌గా మంచి పొజిషన్లో ఉన్నాడు. కార్తీక్ జీ తెలుగులో ప్రసారమైన ‘కామెడీ క్లబ్’ షోతో తన కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం జబర్థస్త్‌లో టీమ్ లీడర్‌గా నవ్వులు పూయిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక, అసలు విషయానికి వస్తే.. కొద్దిరోజుల క్రితం తనకు కాబోయే భార్య గురించిన కొన్ని ఫొటోలను కార్తీక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తే.. లైఫ్ మరింత సంతోషంగా ఉంటుందని కొందరు అంటుంటారు. అది ఇదే కావచ్చు.
నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్యూ బ్యూటీఫుల్. నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఈగర్లీ ఎదురుచూస్తున్నా’ అంటూ పేర్కొన్నాడు. అయితే, ఆ అమ్మాయి ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. ఆ అమ్మాయి ఎవరో తెలీకుండా సస్పెన్స్‌ను క్రియేట్ చేశాడు. తాజాగా, ఆ సస్పెన్స్‌కు కెవ్వు కార్తీక్ తెరదించాడు. తనకు కాబోయే భార్య ఫేస్‌ను రివీల్ చేశాడు. ఆమె దిగిన కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. పెళ్లి గురించి ఓ నోట్ కూడా పెట్టాడు.
ఆ నోట్లో.. ‘‘ పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయని నేను విన్నాను. అయితే, అప్పుడది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. రెండు భిన్న ఆత్మలు, జీవితాలు, భిన్నాభిప్రాయాలు, రెండు భిన్న ప్రపంచాలు.. ఓ హృదయం.. జీవితమనే ప్రయాణంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి. నా జీవిత అందానికి స్వాగతం’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.