ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కపుల్ నిర్మాత రవీందర్, బుల్లితెర నటి వీజే మహాలక్ష్మి. వివాహం చేసుకున్న నాటి నుంచి ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. ఇక ఈ జంట మీద వచ్చినన్ని మీమ్స్, ట్రోలింగ్స్ ఇక ఏ జంట గురించి కూడా జరగలేదు. కానీ వీరు మాత్రం అవేం పట్టించుకోకుండా నూతన దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పోతే.. వీరిద్దరికి ఇది రెండో వివాహామే. మహాలక్ష్మికి అంతకుముందే వివాహం కావడం మాత్రమే కాక.. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కానీ భర్తతో విడిపోయి విడిగా ఉంటుంది. రవీందర్ కూడా భార్య నుంచి విడిపోయి.. ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం సందర్భంగా రవీందర్ శరీరాకృతిపై విపరీతంగా ట్రోల్ చేశారు. కేవలం డబ్బుల కోసమే మహాలక్ష్మి అతడిని వివాహం చేసుకుందని విమర్శించారు.
కానీ ఈ జంట మాత్రం.. ట్రోల్స్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా.. నూతన దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఈ జంట షేర్ చేసిన ఓ ఫోటో చూసిన నెటిజనులు.. మహాలక్ష్మి ప్రెగ్నెంటా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ జంట డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫోటోలను షేర్ చేసింది. దీనిలో మహాలక్ష్మి కాస్తా లావుగా.. పొట్ట భాగం ఎత్తుగా ఉన్నట్లు కనిపించడంతో.. జనాలు.. మహాలక్ష్మి గర్భవతా.. అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ ఫోటోకి రవీందర్ ఇచ్చిన క్యాప్షన్ నెటిజనులు అనుమానాలను మరింత పెంచుతోంది. మరి ఈ వార్తలపై ఈ కపుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.