Anchor Varshini: తెలుగులో ఉన్న లీడింగ్ యాంకర్స్‌లో వర్షిణి సౌందర రాజన్ ఒకరు. ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షిణి త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఆమె ఓ కోటీశ్వరుల ఇంటికి కోడలు కాబోతోందని సమాచారం. వర్షిణి పెళ్లాడేది కూడా ఎవరినో కాదు.. వరుసకు బావ అయ్యే వ్యక్తినేనట. చాలా కాలం నుంచి ఆమె తన బావను ఇష్టపడుతోందట. సినిమా ఆవకాశాల కోసం పెళ్లి విషయంలో ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు ఏవీ లేకపోవటంతో ఆమె పెళ్లికి సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది.
పెద్దలు కూడా వీరి పెళ్లి చేయటానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారట. ఇక, ఆమె బావ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడట. అతడి కుటుంబం బాగా రిచ్ అని తెలుస్తోంది. అతడికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. ఇక, ఈ అక్టోబర్ నెలలోనే వర్షిణి నిశ్చతార్థం జరిగే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో పెళ్లికూడా జరగబోతోందన్న టాక్ సోషల్ మీడియాలో గట్టిగానే నడుస్తోంది. కాగా, వర్షిణి కుటుంబం విషయానికి వస్తే. ఆమెది హైదరాబాద్‌లో సెటిల్ అయిన తమిళ కుటుంబం. ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది.
సినిమాల మీద ఆసక్తితో మోడలింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసింది. శంభో శివ శంభో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది. తర్వాత చందమామ కథలు సినిమాలో ఓ మోస్తరు నిడివి ఉన్న పాత్రను చేసింది. లవర్స్, కాయ్ రాజా కాయ్, బెస్ట్ యాక్టర్స్, శ్రీరామ రక్ష, పెళ్లిగోల, పెళ్లిగోల 2, నన్ను దోచుకుందువటే, పెళ్లి గోల 3 వంటి సినిమాలు వెబ్ సిరీస్‌లో నటించింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే యాంకరింగ్ మొదలుపెట్టింది. దాదాపు అన్ని ఛానల్స్‌ను చుట్టేసింది. హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.