అనసూయ భరద్వాజ్.. అందం, అభినయం, డాన్స్, పంచులతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అటు సినిమాల్లోనూ విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ నటిగానూ చాలా మంచి గుర్తింపు సాధించింది. ఈమెకు ఓ హీరోయిన్‌కు ఉన్నంత ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అనసూయ పేరుపై సోషల్ మీడియాలో పదికి పైగానే ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. తాజాగా ‘ది నెక్ట్స్ సూపర్ స్టార్’, ‘సూపర్ సింగర్ జూనియర్’ అనే షోలకు హోస్ట్ గా ఫుల్ బిజీ అయిపోయింది.
అనసూయ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది జబర్దస్త్ షో. అసలు ఆ షో తోనే అనసూయకు అంత గొప్ప పేరు, ఫేమ్ వచ్చాయంటూ కొందరు అభిప్రాయపడుతుంటారు. ఇప్పుడు అలాంటి షో నుంచి అనసూయ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అది వాళ్లు వీళ్లు చెప్పిన మాట కాదు.. అనసూయనే స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అయితే అందులో నేరుగా ఏ విషయాన్ని ప్రస్తావించని అనసూయ.. ఇన్ డైరెక్ట్‌గా మాత్రం జబర్దస్త్ షో నుంచి తప్పుకోకున్నట్లు ప్రకటించినట్లు అభిమానులు భావిస్తున్నారు.
అసలు ఆ స్టోరీలో ఏం ఉందంటే.. ‘నా కెరీర్‌కు సంబంధించి ఓ అతిపెద్ద నిర్ణయం తీసుకుని.. దానిని ఈ రోజు అమలు చేశాను. నాతో ఎన్నో జ్ఞాపకాలను తీసుకెళ్తున్నాను. వాటిలో చాలా వరకు మంచివి.. కొన్ని చెడ్డవి, ఇంకొన్ని దారుణమైనవి. మీరంతా ఎప్పటిలాగానే నాతో కలిసి ప్రయాణిస్తారని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ అనసూయ భరద్వాజ్ స్టోరీ పోస్ట్ చేసింది. ఇప్పటికే ఆ షో నుంచి చాలా మంది కమీడియన్లు తప్పుకోగా.. ఇప్పుడు అనసూయ కూడా గుడ్ బై చెప్పిందని టాక్ చక్కర్లు కొడుతోంది. అనసూయ జబర్దస్త్ మానేస్తోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.