Hemachandra: సోషల్ మీడియాలో సెలబ్రిటీల ప్రొఫెషన్, కెరీర్ లపై రూమర్స్ రావడమనేది చాలా కామన్. కానీ.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి వచ్చే రూమర్స్ అనేవి వారి లైఫ్ ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. కొందరు పర్సనల్ లైఫ్ పై వచ్చే పుకార్లను తేలికగా తీసుకోవచ్చుగానీ.. మరికొందరు మాత్రం మా పర్సనల్ విషయాలు మీకెందుకని సీరియస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. గత కొద్దిరోజులుగా పాపులర్ సింగర్స్ హేమచంద్ర - శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వారు స్పందించకపోవడంతో దాదాపు ఖరారు అయినట్లే అంటూ వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే స్పందించట్లేదని.. విడాకులు నిజమే కావచ్చంటూ ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై ఎట్టకేలకు హేమచంద్ర, శ్రావణ భార్గవి ఒకేసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ముందుగా శ్రావణ భార్గవి స్పందిస్తూ.. "కొద్దిరోజులుగా నా యూట్యూబ్ వ్యూస్ బాగా పెరిగాయి, ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా పెరిగారు. నేను చేసే పనికంటే ఇప్పుడు ఎక్కువ పని లభిస్తోంది. అలాగే గతంలో నేను సంపాదించే దానికంటే ఇప్పుడు కాస్త ఎక్కువ సంపాదించే అవకాశం దొరికింది. తప్పో ఒప్పో మీడియా అనేది ఒక ఆశీర్వాదమే" అంటూ హేమచంద్రను ట్యాగ్ చేసింది. ఇక హేమచంద్ర పోస్టును రివర్స్ లో షేర్ చేసి.. ఎవరైతే తమ సమయాన్ని వృధా చేసుకోవాలనుకుంటున్నారో, తమ స్టుపిడ్ బయటపెట్టాలి అనుకుంటున్నారో వారికోసమే ఈ పోస్టు అని చెప్పుకొచ్చాడు. "సంబంధంలేని అనవసరమైన సమాచారం, నా ఇండిపెండెంట్ సాంగ్స్ కంటే త్వరగా స్ప్రెడ్ అవుతోంది" అని పేర్కొన్నాడు. మొత్తానికి వీరిద్దరూ కర్ర విరగకుండా పామును చంపినట్లు.. ఎవరినీ హర్ట్ చేయకుండా, సీరియస్ అవ్వకుండా కూల్ గా రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే.. వీరిద్దరూ ఎక్కడకూడా విడాకుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. మరి హేమచంద్ర - శ్రావణ భార్గవి జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by ravuri sravana bhargavi (@ravurisravana.bhargavi) View this post on Instagram A post shared by Vedala Hemachandra (@vedalahemachandra)