కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం మూడ్రోజుల్లో 410 కోట్లుపైగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్ట్ చేసి అబ్బురపరుస్తోంది. ఈ సినిమా చూసుకుంటే రాఖీ ఎంతో పెద్ద గ్యాంగ్‌స్టర్, కేజీఎఫ్ రూలర్. అతను అలా మారడానికి ఆ స్థాయికి ఎదగడం వెనుక ఉన్నది అతని తల్లి. తల్లికి ఇచ్చిన మాట నెరవేర్చేందుకు, ఆమె కోరుకున్న విధంగా బతికేందుకే రాఖీ ఆ స్థాయికి ఎదిగాడు. అంతటి పవర్ ఫుల్ పాత్రలో నటించింది కన్నడ ఇండస్ట్రీకి చెందిన అర్చన జోయిస్.
ఇదీ చదవండి: KGF ఛాప్టర్ 2 మూడు రోజుల కలెక్షన్స్!
అర్చన బోయిస్ వయసు 27 ఏళ్లు మాత్రమే. ఆమె ఇండియన్ ఫిల్మ్ మోడల్, నటి. కన్నడ సినిమా, బుల్లితెర ఇండస్ట్రీలో సుపరిచితురాలు. ఆమె గతంలోనూ అడపాదడప సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు గుర్తింపు లభించింది. అర్చన జోయిస్ కు కథక్ ఇన్‌స్టిట్యూట్ లో బ్యాచిలర్స్ డిగ్రీ కూడా ఉంది. మంచి డ్యాన్సర్ కూడా కలర్స్ కన్నడ ఛానల్ లో ప్రసారమైన తకదిమి ప్రోగ్రామ్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది కూడా. జీ కన్నడలో ప్రసారమైన మహదేవీ అనే సీరియల్ తో తన కెరీర్ మొదలు పెట్టింది. ప్రస్తుతం సువర్ణ టీవీలో ప్రసారమయ్యే దుర్గ అనే సీరియల్ లో లీడ్ రోల్ పోషిస్తోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.