సినిమాల్లో నటించే నటీనటుల జీవితాల గురించి చాలా మంది పలు రకాలుగా మాట్లాడుకుంటారు. చేతినిండా డబ్బు ఉంటుందని, లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని మాట్లాడేస్తుంటారు. కానీ యాక్టర్స్ తెరవెనుక ఎంత కష్ట పడతారనేది వారు తెలుసుకోరు. సన్నివేశాలను రక్తికట్టించడానికి వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఎండనకా వాననక రాత్రింభవళ్లు సైతం ఘూటింగ్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో నటీనటులు ప్రమాదాలకు కూడా గురవుతుంటారు.
సినిమాల్లో నటించే నటీనటుల జీవితాల గురించి చాలా మంది పలు రకాలుగా మాట్లాడుకుంటారు. చేతినిండా డబ్బు ఉంటుందని, లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని మాట్లాడేస్తుంటారు. కానీ యాక్టర్స్ తెరవెనుక ఎంత కష్ట పడతారనేది వారు తెలుసుకోరు. సన్నివేశాలను రక్తికట్టించడానికి వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఎండనకా వాననక రాత్రింభవళ్లు సైతం ఘూటింగ్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో నటీనటులు ప్రమాదాలకు కూడా గురవుతుంటారు. ఇదే అంశానికి సంబంధించి ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ది కేరళ స్టోరీ సినిమాలో నటించి మెప్పించిన హీరోయిన్ షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ విడుదలకు ముందే వివాదాస్పదంగా మారింది. కేరళలో అమాయకపు అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడి చేసి వారిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద క్యాంపుల్లోకి పంపి దేశ వ్యతిరేకులుగా మార్చారు అనే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సినిమాపై పలు రాష్ట్రాలు నిషేధం విధించినప్పటికి మరికొన్ని రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లతో హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మే 5న విడుదలైన ఈ సినిమా సుమారు 200 కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమాలో నటించిన అదాశర్మ ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఎంతగా కష్టపడిందో తెలుపుతూ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ది కేరళ స్టోరీ మూవీ షూటింగ్ అఫ్ఘనిస్తాన్ లో జరిగినపుడు తన ముఖానికి గాయాలైన ఫోటోలను పోస్ట్ చేసింది. గడ్డకట్టేంత చలి మైనస్ 16 డిగ్రీల చలిలో 40 గంటలు ఉన్నామని, దాంతో డీ హైడ్రేషన్ కారణంగా నా పెదాలు పగిలిపోయాయని తెలిపింది. నీరసంతో కిందపడిపోయానని దాంతో తన ముఖానికి గాయాలు అయ్యాయని తెలిపింది. ఈ సినిమా విజయంతో ఆ కష్టాన్ని మర్చిపోయానని తెలిపింది.