సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ నటీనటులను మిలియన్ల కొద్దీ జనాలు ఫాలో అవుతుంటారు.
సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ నటీనటులను మిలియన్ల కొద్దీ జనాలు ఫాలో అవుతుంటారు.. స్టార్స్ కూడా తమ పర్సనల్, ప్రొఫెషనల్ అప్‌డేట్స్ షేర్ చేస్తూ.. ఫ్యాన్స్, నెటిజన్లకు టచ్‌లో ఉంటుంటారు.. సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయింది.. అయితే వీటి కారణంగానే కొన్నిసార్లు ఆర్టిస్టులు ఇబ్బందుల పాలవుతున్నారు.. స్టార్ల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, అభ్యంతరకరమైన ఫోటోలు, వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేసిన సంఘటనలు గతంలో చాలానే చూశాం.. అయితే దీని గురించి సెలబ్స్ స్పందిస్తేనే కానీ అవి నకిలీ అనే అసలు విషయం బయటకి తెలియదు.. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా ఇలాంటి ఆగడాలు మాత్రం ఆగట్లేదు.. ఇప్పటికీ నటీమణుల మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో పైశాచికానందం పొందుతున్నారు కొందరు మూర్ఖులు..
రీసెంట్‌గా పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయవాణి పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా ద్వారా ఆమె నగ్న ఫోటోలు, అడల్డ్ కంటెంట్‌తో కూడిన వీడియోలు షేర్ అవుతున్నాయి.. అవి కాస్తా వైరల్‌గా మారడంతో దీని గురించి జయవాణి స్పందించారు.. జయవాణి గుమ్మడి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మహాత్మ’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.. సరైన వేషాలు రావడం లేదని కొద్ది కాలంగా పెద్దగా చిత్రాలు చేయడం లేదామె.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే జయవాణి పేరు మీద ఈమధ్య ఓ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ అయింది.. వెరిఫైడ్ అకౌంట్ మాదిరి బ్లూటిక్ ఉండడంతో అది అఫీషియల్ ఐడీనే అనుకున్నారంతా.. ఫాలోవర్స్ కూడా పెరిగారు.. కట్ చేస్తే, ఆ ప్రొఫైల్ నుండి ఎక్కువగా అడల్ట్ కంటెంట్ షేర్ అవుతుండడం చూసి జనాలతో పాటు జయవాణి కూడా షాక్ అయింది.. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది..
జయవాణి తాను ‘శూర్పణఖ’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నానని.. దానిలో తన లుక్ ఇదేనంటూ నగ్నంగా ఉన్న ఫోటోలు దర్శనమివ్వడంతో.. అది ఫేక్ అకౌంట్ అని తెలియజేశారు.. తనకు ట్విట్టర్ అకౌంట్ లేదని.. తన పేరుతో ఎవరో అకౌంట్ ఓపెన్ చేసి ఇలాంటి పోస్టులు పెడుతున్నారంటూ మండిపడ్డారు.. ‘‘ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నగ్న ఫోటోలను చూసి అందరూ నన్ను ‘శూర్పణఖ’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నావా? అని అడుగుతున్నారు.. నేను నటించడం లేదని చెప్పాను.. ఆ పిక్స్ నావి కావు.. అది ఫేక్ అకౌంట్.. దయచేసి వాటిని నమ్మకండి.. ఇప్పటికైనా నా పేరుతో అలాంటి పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేయడం కనుక ఆపకపోతే పోలీసులకు కంప్లైంట్ చేస్తాను’’ అంటూ రీసెంట్‌గా ఓ వెబ్‌సైట్‌కిచ్చిన ఇంటర్వూలో హెచ్చరించారు జయవాణి.. ప్రస్తుతం జయవాణి పేరుతో ఉన్న ట్విట్టర్ ప్రొఫైల్ గురించిన న్యూస్.. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది..