అమ్మతనం అనేది ఒక మధురమైన అనుభూతి. తల్లి అవ్వడం కంటే గొప్ప విషయం ఇంకేముంటుంది చెప్పండి. ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలను సృష్టించగలిగే మనుషులను సృష్టించగల శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంది. అయితే ఆ అద్భుత సృష్టి వెనుక వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. పురిటి నొప్పులు భరించాలి. 9 నెలల పాటు అమ్మ పడే నొప్పుల ఫలితమే ఒక సృష్టి. ఇక ఆడవారికి ఉన్న మరొక సమస్య.. పీరియడ్స్. పీరియడ్స్ వల్ల స్త్రీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నవ్వుతూ పనులను చేస్తారు తప్ప తమ సమస్యలను బయటకి చెప్పుకోరు. చెప్పుకోవాల్సి వస్తే భర్తలకు చెప్పుకుంటారు. ఆ సమయంలో వారి భర్తలు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కానీ లాస్య భర్త మాత్రం విభిన్నంగా వ్యవహరించారు.
తనకి పీరియడ్స్ సమస్య ఉందని భర్తకు చెప్పుకుంటే.. ఆమె భర్త మంజునాథ్ పీరియడ్స్ సమస్యను పోస్ట్ పోన్ చేశాడు. ‘ఇగో మంజు.. నాకు పీరియడ్స్ సమస్య చిరాకు తెప్పిస్తోంది, బాధిస్తోంది. ఏదో ఒకటి చెయ్’ అని లాస్య అడుగగా.. ‘శాశ్వతంగా చేయలేను గానీ ఒక 9 నెలలు పీరియడ్స్ నీ జోలికి రావు’ అంటూ ఆమె భర్త మంజునాథ్ వరమిచ్చారు. 1+1 ఆఫర్ లో ఇంకో వరం కూడా ఇచ్చారు లాస్య భర్త. ఆ వరం ఫలితంగా లాస్య కడుపులో ఒక కాయ కూడా కాసింది. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. పీరియడ్స్ పోయాయి, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇదే విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. భర్తతో కలిసి బెడ్ రూమ్ లో కూర్చుని.. బాధపడుతున్న వీడియో ఒకటి షేర్ చేసింది.
ఆ వీడియోలో.. ‘పీరియడ్స్ నన్ను బాధిస్తున్నాయని తనకు చెప్తే.. 9 నెలలు పీరియడ్స్ లేకుండా చేస్తా అని చెప్పి గర్భవతిని చేశాడు’ అంటూ భర్త మీద చిలిపిగా తన ఆవేదనను వెళ్లబుచ్చింది. మంజునాథ్ మాత్రం ఫోన్ చూసుకుంటున్నారు. కాగా ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘బేబీ లోడింగ్ ప్లీజ్ వెయిట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది లాస్య. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసి అషు రెడ్డి క్రేజీ అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
అర్థం చేసుకునే భర్త అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. సుపుత్రిక ప్రాప్తిరస్తు అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇక యాంకర్ లాస్య, మంజునాథ్ దంపతులకు ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే. ఆమె మరోసారి తల్లి అవుతున్నట్లు సెప్టెంబర్ లో ప్రకటించింది. మరి పీరియడ్స్ సమస్య బాధిస్తుందిరో భర్తా అని చెప్పుకుంటే.. 9 నెలలు పీరియడ్స్ కి దూరం చేసిన ఈ మగమహారాజుపై మీ అభిప్రాయం ఏమిటో సెలవియ్యండి. ఆడవారి బాధలను అర్థం చేసుకున్నోళ్ళే అసలైన మగాళ్లు. ఏమంటారు?