Meena Marriage: నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1990 దశకంలో హీరోయిన్ గా సౌత్ ఇండియన్ స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న మీనా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషలలో సినిమాలు చేసింది. అయితే.. స్టార్ హీరోయిన్ అయినటువంటి మీనా.. స్టార్డమ్ లో ఉన్నప్పుడే బెంగుళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని 2009లో పెళ్లి చేసుకుంది.
అప్పటినుండి హీరోయిన్ గా సినిమాలు తగ్గించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతోంది. ఇక మీనా – విద్యాసాగర్ జంటకు 2011లో కూతురు నైనికా జన్మించింది. అయితే.. అటు ఫ్యామిలీతో, ఇటు సినిమాలతో సాఫీగా సాగిపోతున్న మీనా లైఫ్ లో తాజాగా తీరని విషాదం చోటుచేసుకుంది. మీనా భర్త విద్యాసాగర్ జూన్ 28న చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో లంగ్స్ ఫెయిల్ అవ్వడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలలో విషాద ఛాయలు నింపింది.
ఇదిలా ఉండగా.. స్టార్ హీరోయిన్ అయినటువంటి మీనా.. బెంగుళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటని.. అసలు మీనా పెళ్లి వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటనే విధంగా ఆరా తీస్తున్నారు నెటిజన్స్. అయితే.. 2009 జూలై 12న మీనా – విద్యాసాగర్ ల వివాహం ఆర్య వైశ్య సమాజ్ కళ్యాణ మండపంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది.
అనంతరం వీరిద్దరూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని.. చెన్నైలో సినీ స్టార్స్, ఇండస్ట్రీకి చెందిన ఫ్రెండ్స్ అందరికీ రిసిప్షన్ ఏర్పాటు చేశారు. చెన్నైలోని మేయర్ రామనాథన్ చిట్టియార్ హాల్ లో మీనా, విద్యాసాగర్ ల రిసిప్షన్ కి దక్షిణాది సినీ తారలంతా తరలివచ్చారు. ఇక పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న మీనా.. భర్త ప్రోత్సాహంతో మళ్లీ సినిమాలలో కంటిన్యూ అవుతూ వచ్చింది.
ఇక ఇప్పుడు మీనాతో పాటు ఆమె కూతురు నైనికా కూడా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం మీనా రౌడీ బేబీ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. కానీ.. ఇంతలోనే ఆమె భర్త విద్యాసాగర్ మరణంతో మీనా కుటుంబం శోకసంద్రంలో మునిగింది. మీనా భర్త మృతిపట్ల సినీ తారలంతా సంతాపం తెలియజేస్తున్నారు. మరి మీనా – విద్యాసాగర్ ల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Shocking: Famous actress #Meena’s husband #Vidyasagar passed away. He had lung-related ailments, the recent COVID19 infection made it worse for him. Sad news, May his soul RIP. pic.twitter.com/MoOsn2GBJC
— Rajasekar (@sekartweets) June 28, 2022