సాధారణంగా చిత్ర పరిశ్రమలో వారానికి పదుల సంఖ్యలో మూవీలు రిలీజ్ అవుతుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాల కొల్లగొట్టి.. వసూళ్లలో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడతాయి. అయితే ప్రస్తుతం ప్రేక్షకుల్లో సినిమాలు చూసే విధానం మారిపోయింది. హీరోలను బట్టి కాకుండా కథలను ఎంచుకుని సినిమాలకు వెళ్తున్నారు. దాంతో మన హీరోలు సైతం వారికి తగ్గట్లుగానే కథలను ఎంచుకుని ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ క్రైమ్ థ్రిల్లర్ తో అభిమానుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో అడవి శేష్. అతడు నటించిన చిత్రం హిట్ 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల నుంచి మంచి టాక్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇక హిట్ 2 ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందో ఇప్పుడు చూద్దాం.
విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో మేకర్స్ దీనికి కొనసాగింపుగా హిట్ 2 ను నిర్మించారు. అడవి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకు ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించగా.. హీరో నాని, ప్రశాంతి త్రిపిర్నేనిలు సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే మెుదటి రోజు కలెక్షన్లతో దుమ్మురేపింది హిట్ 2. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
హిట్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఏరియాల వారీగా..
Hit 2 day 1 Box Office Collections..!!#HIT2The2ndCase #HIT2 #AdiviSesh #Nani #allwoodreviews pic.twitter.com/l02LP6iYsV
— ALLWood Reviews (@AllwoodReviews) December 3, 2022