సినిమా హీరోలకు, హీరోయిన్లకు డూప్ లు ఉండడం మామూలే. నటించమంటే నటించగలరు గానీ కొన్ని కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించడం అంటే సున్నితంగా ఉండే హీరోలకు, హీరోయిన్లకు కష్టం. బాహుబలిలో అనుష్క నటించిన కొన్ని సన్నివేశాల్లో మనకు కనిపించేది అనుష్క కాదు. వేరే హీరోయిన్. ఆ హీరోయిన్ కూడా దూరం నుంచి చూస్తే అచ్చం అనుష్కలానే ఉంటుంది. ఆ హీరోయిన్ ఎవరంటే?
బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో నటించిన ప్రధాన నటులందరికీ అంతర్జాతీయంగా మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. బాహుబలిగా, శివుడిగా ప్రభాస్, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, భళ్లాలదేవగా రానా, బిజ్జలదేవగా నాజర్ వంటి నటులకు ఎంతో మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా అనుష్క అయితే డీగ్లామర్ రోల్ లో చాలా బాగా నటించిందన్న మార్కులు పడ్డాయి. భళ్లాలదేవ దేవసేనను సంకెళ్లతో బంధించి చిత్రహింసలు పెడుతుంటే.. ఆమె మాత్రం తన సంకెళ్లను తెంచడానికి తన కొడుకు వస్తాడని ఎదురుచూస్తుంటుంది.
భళ్లాలదేవ పుల్లలు ఏరుతూ చితి పేరుస్తుంటుంది. అయితే ఈ సన్నివేశంలో అనుష్కకు డూప్ గా ఒక హీరోయిన్ నటించిందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుష్కకు డూప్ గా మరో హీరోయినా? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజమే. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ రుషిక రాజ్. 2021లో వచ్చిన అశ్మీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో బోల్డ్ గా నటించింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ హీరోయిన్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. అయితే నటిగా ఈమె మొదటి సినిమా అశ్మీ అనుకుంటారు కానీ బాహుబలి సినిమానే ఈమె మొదటి సినిమా. బాహుబలి సినిమాలో అనుష్క డూప్ గా నటించింది.
లాంగ్ షాట్స్ లో అనుష్కలా కనిపించేది అనుష్క కాదు, రుషిక రాజ్. దూరం నుంచి చూస్తే అనుష్క, రుషిక రాజ్ ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఎత్తు, రంగు ఒకేలా ఉండడంతో గుర్తుపట్టడం కష్టం. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన బాణాలు సంధించే సీక్వెన్స్ లో ఎక్కువగా కనిపించేది రుషిక రాజ్ నే. అలానే మాసిన చీరలో ఉన్న సన్నివేశాల్లో కూడా అనుష్క డూప్ గా రుషిక రాజ్ నే నటించింది. ఈ బాహుబలి సిరీస్ లో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా నటించింది. ప్రస్తుతం వీటికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అశ్మీ సినిమాలో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయినా గానీ అవకాశాలు రావడం లేదు. టాలెంట్ ఉన్న నటి అయినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు. మరి దీనిపై మీ అభిపాయమేమిటో కామెంట్ చేయండి.