ఇప్పుడు జనరేషన్ వాళ్లకు రంభ గురించి తెలియకపోవచ్చు గానీ.. ఓ 20 ఏళ్ల ముందు ప్రేక్షకులు మాత్రం హీరోయిన్ రంభ అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. 90ల్లో బబ్లీ, గ్లామరస్ పాత్రలతో హీరోయిన్ గా చాలా ఫేమ్ తెచ్చుకున్న ఈమె.. కొన్ని చిత్రాల్లో అమాయకపు, అల్లరి పిల్ల రోల్స్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఇక హీరోయిన్ గా ఛాన్సులు తగ్గిన తర్వాత పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మలేషియాకు చెందిన ఓ బిజినెస్ మేన్ ని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న రంభ.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తనతో పాటు నటించిన జేడీ చక్రవర్తిపై అయితే షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇక విషయానికొస్తే.. విజయలక్ష్మి విజయవాడలో పుట్టింది. ఈమెనే సినిమాల్లోకి ఛాన్సులు రావడంతో తన పేరుని రంభగా మార్చుకుంది. 1992లో రిలీజైన ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితోనూ యాక్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా లాంటి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక చాలామంది హీరోలతో మూవీస్ చేసినప్పటికీ జేడీ చక్రవర్తితో చేసిన సినిమాలు మాత్రం చాలా పేరు తెచ్చుకున్నాయి. ‘బొంబాయి ప్రియుడు’ సినిమాతో ఈ జంట, తెలుగు ప్రేక్షకుల్ని బాగా అలరించింది. ఇక ‘కోదండ రాముడు’ చిత్రంలో జేడీ-రంభ కలిసి నటించారు. అలా వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ.. జేడీ గురించి ఆశ్చర్యపరిచే వ్యాఖ్యలు చేసింది.
‘జేడీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అయినా సరే నా పెళ్లికి రాలేదు. దీంతో నేను చాలా అప్ సెట్ అయ్యాను. జేడీ చక్రవర్తి.. ఫ్రెండ్ షిప్ ని మెంటైన్ చేసే విషయంలో చాలా అబద్దాలకోరు.’ అని రంభ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తున్న రంభ… త్వరలో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఇదిలా ఉండగా చిరంజీవి, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రంభ.. ఎన్టీఆర్ ‘నాగ’, అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లోనూ డ్యాన్స్ చేసింది. ఇవి అప్పట్లో చాలా పాపులర్ అయ్యాయి. ఇక ఇప్పుడు రంభ రెడీ అని సిగ్నల్స్ వస్తున్నాయి కాబట్టి.. తెలుగు దర్శకులు ఎవరైనా సరే ఆమెకు ఛాన్సిస్తారేమో చూడాలి. సరే ఇదంతా పక్కనబెడితే జేడీ చక్రవర్తిపై రంభ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.