హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ మలయాళంలో ఆంటోనీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కల్యాణి గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. ఆమె తండ్రి ఒకప్పుడు మలయాళంలో పెద్ద దర్శకుడు. తెలుగులో ఆయన నాగార్జునతో ‘నిర్ణయం’ అనే సినిమా చేశారు. ఆమె తల్లి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. ఇక, కల్యాణి తెలుగు సినిమాతోనే హీరోయిన్గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అఖిల్ అక్కినేనితో కలిసి 2017లో ‘హలో’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా దర్శకుడు ‘విక్రమ్ కే కుమార్’.. కల్యాణి తండ్రి ప్రియదర్శన్‌కు శిష్యుడు కావటం విశేషం.
హలో సినిమా తర్వాత ఆమె తెలుగులో వరుసగా రెండు సినిమాలు చేశారు. ఆ తర్వాత తెలుగు తెరకు దూరం అయ్యారు. తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ‘ఆంటోనీ’ అనే మలయాళ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరావేగంగా జరుగుతోంది. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా కల్యాణి గాయపడ్డారు. ఆమె ఎడమ చేతికి గాయం అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు.
ఇందుకు సంబంధించి ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘స్టంట్లు బలహీనుల కోసం కాదు’’ అని పేర్కొన్నారు. ఆంటోనీ షూటింగ్లో భాగంగా 29వ రోజు ఆ గాయం అయినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న ఆమె ఫ్యాన్స్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరి, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ చేతికి అయిన గాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kalyani Priyadarshini’s recent Instagram post pic.twitter.com/XxpIDLvfuQ
— Viral Briyani (@Mysteri13472103) June 21, 2023