ఈమె హీరోయిన్ గా ఇండియా వైడ్ ఫేమస్. క్రికెట్ లోనూ వరల్డ్ వైడ్ పాపులర్. ఇలా రెండింట్లోనూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఈమె సొంతం. ఎవరో గుర్తుపట్టారా?
సాధారణంగా సినిమా హీరోయిన్లు అనగానే గ్లామర్ రోల్స్ వల్ల గుర్తింపు తెచ్చుకుంటారాని అనుకుంటాం. ఈమె మాత్రం యాక్టర్ గా ప్రూవ్ చేసుకుని లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. అసలు ఈమెకు ఏ మాత్రం సంబంధం లేని క్రికెట్ లోనూ కోట్లాది మంది అభిమానుల్నిసంపాదించుకుంది. పెళ్లయి, తల్లి అయినా సరే అటు గ్లామర్ ఇటు ఫేమ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా చాలా పెరిగిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన కనిపిస్తున్న చిన్నారి రాముడి జన్మస్థలమైన అయోధ్యలో పుట్టి పెరిగింది. యంగ్ ఏజ్ లోనే మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. 2008లో ‘రబ్ నే బనాదే జోడీ’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాకే ఏకంగా షారుక్ ఖాన్ లాంటి స్టార్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. అక్కడ నుంచి మొదలుపెడితే ఆచితూచి చిత్రాలు చేస్తూ వచ్చింది. ఆమెనే అనుష్క శర్మ. ఇప్పటివరకు 21 సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ.. వాటిలో చాలావాటితో హిట్స్ అందుకుంది. నిర్మాతగానూ తనలోని మరో టాలెంట్ ని బయటపెట్టింది.
ఈమె సినిమా కెరీర్, హీరోయిన్ అనేది పక్కనబెడితే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని లవ్ చేసుకుని పెళ్లాడింది. ఇది ఈమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయింది. కోట్లాది మంది సినిమా, క్రికెట్ ఫ్యాన్స్ ఫేవరెట్ హీరోయిన్ అయ్యింది. ప్రస్తుతం ‘చక్ దా ఎక్స్ ప్రెస్’ అనే సినిమా చేస్తోంది. ఇది భారత మహిళా క్రికెటర్ ఝలాన్ గోస్వామి బయోపిక్. ఈరోజు అంటే మే1న అనుష్క పుట్టినరోజు. అందుకే ఈమె ట్రెండ్ అవుతుంది. సో ఇదంతా పక్కనబెడితే పైన చిన్నపిల్ల ఫొటో చూసి ఈమెనే అని మీలో ఎంతమంది గెస్ చేశారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.