దక్షిణాదిన అద్భుతమైన చిత్రాలతో అమలాపాల్ అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత టాలీవుడ్ కు కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. 2021లో పిట్ట కథలులో చివరిగా ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల అమలాపాల్ ప్రొడ్యూసర్ గా కూడా మారింది.
అమలాపాల్ గురించి దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో గొప్ప సినిమాలు చేసింది. దాదాపుగా అందరు యంగ్ స్టార్ హీరోల సరసన నటించింది. 2021లో అమలాపాల్ చివరిగా పిట్ట కథలు సినిమాతో అలరించింది. తర్వాత కెరీర్ గ్రాఫ్ మెల్లగా పడిపోయింది. ఇప్పుడు తాజాగా అమలాపాల్ ప్రొడక్షన్స్ తో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కడవర్ పేరుతో ఒక క్రైమ్ థ్రిల్లర్ ని తెరకెక్కించింది. ఆ సినిమాలో ఒక డాక్టర్ గా అద్భుతంగా నటించింది.
సినిమాల సంగతి పక్కన పెడితే అమలాపాల్ ప్రస్తుతం దైవ చింతన, ధ్యాన మార్గంలో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్టులు చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆమె తాజాగా ఫ్యాన్స్, ఫాలోవర్స్ కు పౌర్ణమి, హోళీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. శుభాకాంక్షలు తెలిపితే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ, ఆమె విషెస్ చెప్పిన విధానం మాత్రం భిన్నాభిప్రాయాలకు తావిస్తోంది. టీనేజ్ నుంచి తనకు ఇప్పటికీ ఎంతో నచ్చిన పాట అంటూ ఘర్షణ సినిమాలోని నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ.. పాట తమిళ వర్షన్ కు డాన్స్ చేసింది. జీన్స్ షార్ట్, మినీ టాప్ లో ఇలా విషెస్ చెప్పడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.
మార్చి 8న హోళీ, మహిళా దినోత్సవం కూడా. అయితే ఆమె మహిళా దినోత్సవాన్ని పట్టించుకోలేదు అది వేరే విషయం. “అందరికీ పౌర్ణమి- హోళీ శుభాకాంక్షలు. కన్యారాశిలో పౌర్ణమి ఏర్పడింది. తెరలు తొలగించి మీలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసేందుకు ఇదే సరైన సమయం. మనల్ని మనలాగే యాక్సెప్ట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పౌర్ణమి మీ కలలను సాకారం చేసుకునేందుకు, మీ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు, మీ మేథో శక్తిని బయట పెట్టేందుకు తోడ్పడుతుందని ఆకాంక్షిస్తున్నాను. మొత్తం కోల్పోయినప్పుడే మీరేంటో మీకు తెలుస్తుంది” క్యాప్షన్ జతచేసింది. అంతేకాకుండా తన టీనేజ్ వయసు నుంచే ఇది ఆమెకు బాగా నచ్చిన పాటని అమలా పాల్ తెలిపింది.