ఈమె తండ్రితోపాటు బంధువులు అందరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే. అయినాసరే లక్ కలిసిరావడం లేదు. సినిమాలు చేస్తున్న హిట్స్ పడటం లేదు. మరి ఆమె ఎవరో కనిపెట్టారా?
హీరోల కొడుకులు హీరోలు అవుతుంటారు కానీ సదరు హీరోలకు కూతుళ్లు ఉండి, వాళ్ల యాక్టర్స్ అయిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. కానీ ఈ పాప రియాలిటీ దాన్ని చేసి చూపించింది. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. చేసనవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయా ఇండస్ట్రీల్లోని స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన కనిపిస్తున్న పాప చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో, ఇప్పుడు హీరోయిన్ అయిన తర్వాత కూడా అంతే అందంగా కనిపిస్తుంది. తల్లితండ్రులు ఇద్దరూ యాక్టర్స్, దీంతోపాటు చాలామంది రిలేటివ్స్ కూడా ఇండస్ట్రీకి చెందినవాళ్లే కావడంతో ఫస్ట్ సింగర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. అవును మీరు గెస్ చేసింది కరెక్ట్. పైన ఫొటోలోని బ్యూటీ పేరు అక్షర హాసన్. కమల్ హాసన్ ముద్దుల కూతురు. 2015లో ఫస్ట్ మూవీ అమితాబ్, ధనుష్ లాంటి స్టార్స్ తో కలిసి చేసింది. కానీ లక్ కలిసి రాలేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది.
ఆ తర్వాత మరో హిందీ మూవీ చేసింది కానీ ఈ బ్యూటీకి బాలీవుడ్ లో కలిసి రాలేదు. దీంతో సొంత ఇండస్ట్రీ తమిళంలోకి వచ్చేసింది. అజిత్ తో ‘వివేగం’, విక్రమ్ తో ‘కదరం కొండన్’ తదితర చిత్రాలు చేసింది. ఈ రెండు హిట్ అయినాసరే ఈమెకు అయితే పెద్దగా పేరు రాలేదు. గతేడాది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలోనూ అక్షర లీడ్ రోల్ చేసింది. ప్రస్తుతం ఓ మూవీ చేస్తోంది. తండ్రి కమల్ హాసన్ అంత పెద్ద స్టార్ అయినప్పటికీ.. హీరోయిన్ గా ఈ బ్యూటీకి మాత్రం పెద్దగా సక్సెస్ లు రావడం లేదు. అదే టైంలో అక్క శ్రుతిహాసన్ మాత్రం పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ హీరోయిన్ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.