Hero Yash: మరో పాన్ ఇండియా సినిమా ‘‘ కేజీఎఫ్-2’’ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అయింది. ఇప్పటికే బ్లాక్ బాస్టర్ టాక్‌తో మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. ఇన్నేళ్లుగా ప్రశాంత్ నీల్-యశ్ పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించినట్లుయింది. ఈ సినిమా బృందం పెద్దగా ప్రమోషన్లు నిర్వహించలేదు. అవసరం అనుకున్న చోట ప్రశాంత్-యశ్‌లు ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా, తెలుగులో యాంకర్ సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు యశ్. తెలుగు హీరోలతో తనకున్న అనుబంధాన్ని ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌తో తనకు మంచి స్నేహం ఉందని అన్నారు.
హైదరాబాద్‌లో షూటింగ్ జరిగినపుడు తనను ఇంటికి భోజనానికి పిలుస్తుంటారని తెలిపారు. ఎన్టీఆర్ తల్లి శాలినిది కూడా కర్ణాటకనేనని.. ఆమెతో సొంత ఊరి బంధం ఉందని అన్నారు. తనను ఇంట్లో మనిషిలాగా చూస్తుందని చెప్పారు. ఇంట్లో వాళ్లందరూ కూడా తనను సొంత మనిషిలా చూస్తారని అన్నారు. అందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. రామ్ చరణ్‌తో కూడా తనకు చక్కటి అనుబంధం ఉందని అన్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ జరిగిన ప్రతీసారి రామ్‌చరణ్ ఇంటినుంచి భోజనం పంపిస్తారని చెప్పారు. ఎన్టీఆర్-రామ్‌చరణ్, తాను ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటామని అన్నారు. మరి, యశ్ కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అభిమాని తిక్క ప్రశ్న.. శృతి హాసన్ ఎలా రిప్లై ఇచ్చిందంటే?..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.