కార్తీక మాసం.. హరిహరులకు చాలా ఇష్టమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో శివ, విష్ణు క్షేత్రాలు నిత్యాదీపారాధనతో వెలిగిపోతాయి. ఇక మన దేశంలో.. కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. సామాన్యులేక కాక సెలబ్రిటీలు కూడా అయ్యప్ప దీక్ష తీసుకోవడం గమనించాం. మన దగ్గర రామ్ చరణ్, చిరంజీవి, సురేష్ బాబు, నాని, విశ్వక్ సేన్ వంటి వారు తరచుగా అయ్యప్ప మాల వేసి.. శబరిమల వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. ఇక అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్ వంటి హీరోలు సైతం.. అప్పుడప్పుడు అయ్యప్ప మాల వేస్తారు. అయ్యప్ప దీక్ష ఎంతో పవిత్రమైనదే కాక.. శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇలాంటి దీక్షల వల్ల.. ఆధ్మాత్మికంగానే కాక.. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు ఉంటాయి.
తాజాగా హీరో విశ్వక్ సేన్ ఇంట అయ్యప్ప స్వామి పడి పూజ ఎంతో ఘనంగా నిర్వహించారు. పదుల సంఖ్యలో స్వాములు.. ఈ పూజలో పాల్గొన్నారు. ఇక అయ్యప్ప స్వామికి ఊరేగింపు నిర్వహించారు. ఎంతో ఘనంగా.. భక్తి శ్రద్ధలతో.. అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తుండటమే కాక.. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. ఇక 2023, ఫిబ్రవరి 17న ఈ చిత్రం విడుదల కానుంది.