తమిళనాడులో ఇళయ దళపతి విజయ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న వ్యక్తి విజయ్. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానలకు పండగే. అయితే తాజాగా విజయ్.. తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు.
విజయ్ నటించిన తాజాగా చిత్రం బీస్ట్.. ఈనెల13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో అభిమానుల విషయంలో విజయ్ ముందు జాగ్రత్త పడ్డారు. రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న వారిని, అధికారుల్ని, ప్రభుత్వానికి సంబంధించిన వారి, ఇలా ఎవ్వరినీ విమర్శించ వద్దని అభిమానులను హెచ్చరించారు. మీడియాలో, సోషల్ మీడియా ద్వారా గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఇలా అభిమానులు విషయంలో హీరో విజయ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియలజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.