కోహ్లీ-గంభీర్ వివాదం తర్వాత ఈ ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన అంశం ఏదైనా ఉందంటే అది ధోని రిటైర్మెంటే. కోట్లాది మంది ఆరాధించే ఎంఎస్డీ ఐపీఎల్ రిటైర్మెంట్పై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి.
ఈసారి ఐపీఎల్లో ఆసక్తికరంగా మారిన అంశాల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ఒకటి. అతడికి ఇదే చివరి ఐపీఎల్ అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. క్రికెట్ విశ్లేషకులతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా ధోని నెక్స్ట్ సీజన్లో ఆడకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శరీరం సహకరించకపోవడం, జట్టును నడిపాలంటే ఉండే ఒత్తిడి తదితర కారణాల రీత్యా మాహీ ఇకపై ఐపీఎల్లో ఆడకపోవచ్చని అంటున్నారు. ధోని రిటైర్మెంట్ రూమర్స్ ఐపీఎల్ స్ట్రీమింగ్ పెరగడానికి దోహదపడుతోంది. ధోని ఆట చూసేందుకు చెన్నైతోపాటు ఇతర స్టేడియాలకూ ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు. ఈసారి ఐపీఎల్‌ను కేవలం ధోని ఆట కోసం మాత్రమే చూస్తున్నవారు చాలా మందే ఉన్నారు.
చెన్నై జట్టు మ్యాచ్ అంటే చాలు జియో సినిమాలో వీక్షకుల సంఖ్య సుమారుగా రెండు కోట్ల వరకు ఉంటోంది. అయితే మొత్తానికి లక్నోతో మ్యాచ్ సందర్భంగా ధోని తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. ఇది తన చివరి ఐపీఎల్ అని అందరూ డిసైడ్ అయ్యారని.. కానీ తాను మాత్రం కాదంటూ తెలివైన సమాధానం ఇచ్చాడు. ఈ సంగతిని అటుంచితే.. సోషల్ మీడియాలో ధోనీకి సంబంధించిన ఒక ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. నెరిసిన గడ్డం, సీఎస్కే జెర్సీలో స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న ఒక అభిమాని అచ్చం ధోనీలా కనిపించాడు. దీంతో కెమెరామెన్ షాకయ్యాడు. కానీ ఫ్రేమ్‌లో ఆ వ్యక్తి పక్కకు జరగ్గానే ముఖ కవళికల్లో మార్పు కనిపించింది. 20 ఏళ్ల తర్వాత ధోని బహుశా ఇలాగే ఉంటాడేమోనని నెటిజన్స్ ఈ ఫొటోపై కామెంట్లు చేస్తున్నారు.