ఎంత గొప్ప హూదాలో ఉన్నా కొన్ని సార్లు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంత పశ్చాతాప పడేలా చేస్తుంటాయి. ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఆస్కార్ 2022లో లైవ్ వేడుకలో తన భార్యపై కామెంట్స్ చేశాడన్న కోపంతో యాంకర్ గా వ్యవహరిస్తున్న క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించాడు విల్ స్మిత్. ఈ ఘటనపై ఆస్కార్ నిర్వాహకులతో పాటు చాలా మంది స్మిత్ పై చాలా విమర్శలు కురిపించారు. అంతేకాదు ఒక నటుడిగా ఉండి కోట్ల మంది చూస్తున్నారన్న విషయం మరిచి అలా ప్రవర్తించడంపై ప్రేక్షకులు సైతం విమర్శించారు.
క్రిస్ రాక్ని కొట్టిన విషయంపై విల్ స్మిత్ ఆస్కార్ కమిటీ చట్టపరమైన చర్యలకూ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఘటనకు స్మిత్ క్షమాపణలు కోరాడు. తన భార్యపై కామెంట్ చేయడంతో సహనం కోల్పోయానని.. తన భార్య పింకెట్ స్మిత్ జుట్టు మొత్తం రాలిపోయే ‘అలోపీసియా’ అనే వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలియక క్రిస్ రాక్ వేసిన జోక్ కి తాను ఇబ్బంది పడ్డానని అందుకే కొట్టానని అన్నారు.
‘క్రిస్, నేను మీకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను తప్పు చేసినందుకు సిగ్గుపడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.’ ఈ విషయంపై క్షమాపణలు చెబుతూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన నోట్ లో షేర్ చేశాడు.