ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా రిలీజ్ అయ్యాక హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఇండియన్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మొదటి వరుసలో ఉంటుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.
ఆ మాటకొస్తే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా లవర్స్ కి కూడా ఇది శుభవార్తేనట. ఎందుకంటే.. రానున్న ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ పేరు వినిపిస్తున్నట్లు వార్తలు చెబుతున్నాయి. హాలీవుడ్ ప్రముఖ మీడియా సంస్థ వెరైటీ నివేదికలో ఎన్టీఆర్ పేరును మెన్షన్ చేయడం విశేషం. ఆర్ఆర్ఆర్ సినిమా భారతీయ ప్రేక్షకులను మాత్రమే కాదు, హాలీవుడ్ ప్రముఖులను సైతం మెప్పించింది. అందులోనూ ముఖ్యంగా ఎన్టీఆర్ నటన అందరినీ ఎమోషనల్ గా టచ్ చేసింది.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నటనకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందనేది హాలీవుడ్ విశ్లేషకుల అంచనా. ప్రతి ఏడాది ఆస్కార్ నామినేషన్స్ ప్రకటించడానికి ముందు ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది? అంటూ ‘ప్రెడిక్షన్స్’ చెప్పడం జరుగుతూనే ఉంటుంది. అయితే.. ఉత్తమ నటుడి కేటగిరిలో ఈ ఏడాది ఎవరెవరు ఉండొచ్చని లిస్టును ‘వెరైటీ’ సంస్థ రిలీజ్ చేసింది. అందులో పోటీగా హాలీవుడ్ హీరోలతో పాటు జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా పేర్కొన్నారు. అయితే.. ఎన్టీఆర్ పేరు టాప్ 40లో లేకపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. హాలీవుడ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ఒక సెన్సేషన్. అక్కడి ప్రేక్షకులు, విమర్శలకులు, ప్రముఖులను అందరినీ మన సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక గూగుల్ లో ‘ఆర్ఆర్ఆర్’ అని సెర్చ్ చేస్తే.. సెర్చ్ బార్ కింద గుర్రం, బైక్ వెళుతూ కనిపించడం మరో విశేషం. ఇదివరకే ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ కూడా ఉండబోతుందని టాక్ నడిచింది. మరి ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇవైతే గుడ్ న్యూస్ గానే చెప్పాలి. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Hollywood magazine #Variety mentioned #JrNTR as possible contender for the #Oscars best actor award & #SSRajamouli and #RRR for best director and best film in the unranked category
PRIDE OF INDIAN CINEMA NTR#Oscars2023 #NTRGoesGlobal #NTRforOSCARS #NTR𓃵 #NTR #ManOfMassesNTR pic.twitter.com/J1YvfBFuFk— Jyoti Chourasiya (@Chourasiajyoti1) August 13, 2022