సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్.. కుటుంబ సమేతంగా సోమవారం విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్నాడు. అమ్మవారి దర్శనానికి వచ్చిన తేజ్ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను తేజ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా సాయి ధరమ్ మాట్లాడుతూ.. “ఎప్పుడూ విజయవాడ వచ్చిన అమ్మవారిని తప్పకుండా దర్శిచుకుంటాను. ఎప్పుటి లాగానే ఈ సారి కూడా చాలా ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగింది” అని ఆయన అన్నారు. గతేడాది సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకొని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నట్లు సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.