తెలుగు యువహీరోల్లో నితిన్ ది ప్రత్యేక స్థానం. టీనేజ్ లోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇతడు.. ఆ తర్వాత వరసగా హిట్స్ కొట్టాడు. కె.రాఘవేంద్రరావు, ss రాజమౌళి లాంటి అగ్రదర్శకులతోనూ సినిమాలు చేశాడు. అలాంటి నితిన్ ప్రస్తుతం మాస్ చిత్రాలతో పాటు డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి నితిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్ రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విషయం కాస్త వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు హీరోల్లో డ్యాన్స్ తో అదరగొట్టే వారిలో హీరో నితిన్ ఒకడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి వీరాభిమాని అయిన ఇతడు.. ఆ విషయం సమయం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూనే ఉంటాడు. ఇకపోతే నితిన్ త్వరలో తండ్రి కాబోతున్నాడనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ టైంలో అంటే 2020లో తను ప్రేమించిన షాలినీని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి పండగల్లాంటి అకేషన్స్ లో వీరిద్దరూ జంటగా ఫొటోలు పెడుతున్నారు కానీ ఇప్పటివరకు గుడ్ న్యూస్ ఏం చెప్పలేదు. అయితే త్వరలో అభిమానుల కోసం ఆ విషయం నితిన్ స్వయంగా రివీల్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
నితిన్ భార్య షాలినీ ప్రస్తుతం గర్భవతి అని, దీపావళి సందర్భంగా ఈ వార్త తెలిసిందని పలువురు ఫ్యాన్స్ అంటున్నారు. దీనితోపాటే తన డ్రీం హోమ్ కి సంబంధించిన సమస్యలు కూడా క్లియర్ అయిపోయాయని, ఈ రెండింటి గురించి నితిన్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ‘ఇష్క్’ మూవీతో కెరీర్ ని రీస్టార్ట్ చేసిన నితిన్.. ఆ తర్వాత మూవీస్ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. కొన్నాళ్ల ముందు ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. రొటీన్ మాస్ ఫార్ములా సినిమా కావడంతో అది బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ప్రస్తుతం నితిన్, రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మరి నితిన్ తండ్రి కాబోతున్నాడనే వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Happy Diwali 🪔…. From ours to yours ❤️ pic.twitter.com/CkA7pT8IEi
— nithiin (@actor_nithiin) October 24, 2022