తెలుగు ఇండస్ట్రీలో పలువురు లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో వ్యక్తి చేరనుంది. ఇప్పటికే టాలీవుడ్ చాలామంది హీరోయిన్లకు ఆమె ఫ్రెండ్. మరి ఎవరో ఐడియా వచ్చిందా?
టాలీవుడ్ లోకి ఎప్పటికప్పడు కొత్త హీరోహీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలానే సినిమాల తీసే డైరెక్టర్స్ నంబర్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పటి దర్శకులు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. మాస్ మసాలా కమర్షియల్ మూవీస్ కాకుండా మన కథలతో మూవీస్ తీస్తున్నారు. రీసెంట్ టైంలో ‘బలగం’ అలానే క్లిక్ అయింది. అందరికీ కమెడియన్ గా తెలిసిన వేణు.. ఈ రేంజ్ లో ఏడిపిస్తాడని ఎవరూ కనీసం ఊహించి ఉండరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తెలుగులో మరో లేడీ డైరెక్టర్ ఎంటరవుతోంది. ఈ విషయాన్ని హీరో నితిన్ రివీల్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లో కావొచ్చు, ఈవెంట్స్ లో కావొచ్చు హీరోహీరోయిన్లు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. తాజాగా ‘దసరా’ ప్రమోషన్స్ లో హీరో అదిరిపోయే డ్రస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. దీనంతటికీ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన రీజన్. 2013 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె.. ‘బాద్ షా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరోయిన్లు చాలామంది పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ గానూ వర్క్ చేసింది. తెలుగు సినిమాలతోపాటు పలు డబ్బింగ్ మూవీస్ కి కూడా పనిచేసింది. అలాంటి ఈమె ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతుంది.
టాలీవుడ్ లో స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ అయిన ఈమె.. డైరెక్టర్ కాబోతున్న విషయాన్ని హీరో నితిన్ తాజాగా రివీల్ చేశాడు. సంతోషంగా ఉందని ట్వీట్ చేస్తూ, స్క్రిప్ట్ కూడా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. దీనిబట్టి చూస్తుంటే.. నీరజ కోన డైరెక్ట్ చేసే మూవీలో హీరో నితిన్ అని తెలుస్తోంది. మిథున్ చైతన్య స్టోరీ రాయగా, దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్.. ఈప్రాజెక్టు కోసం వర్క్ చేయనున్నారు. ఇప్పటికే తిక్క, ఛల్ మోహనరంగ, మిస్ ఇండియా సినిమాల్లో సాంగ్స్ కోసం లిరిక్స్ రాసిన నీరజ.. ఇప్పుడు డైరెక్టర్ కావడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల్ని పలకరిస్తుందో చూడాలి. కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ లిరిసిస్ట్.. ఇప్పుడు డైరెక్టర్ కానుండటపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Heroooo ❤️❤️❤️❤️ it means the world … thankoooo 🤗 https://t.co/ul7s2DjXKX
— Neerajaa Kona (@NeerajaKona) April 6, 2023