ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు టాలీవుడ్ లో హీరో, ప్రొడ్యూసర్ గా చాలా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరో గుర్తుపట్టారా?
టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నారు. వీళ్లలో కొందరు మిగతావాళ్లతో పోలిస్తే కాస్త డిఫరెంట్. అంటే టీనేజ్ లోనే ఇండస్ట్రీలోకి వచ్చేయడం, వయసులోకి రాకముందు సూపర్ హిట్స్ కొట్టేయడం. అదే టైంలో ఘోరమైన ఫ్లాప్స్ కూడా అందుకోవడం చూసిన కొందరు హీరోలున్నారు. కానీ పడిన చోటే మళ్లీ లేవాలి, నిలదొక్కుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి హీరోనే పైన ఫొటోలో కనిపిస్తున్న పిల్లాడు. సినిమాల విషయంలో పట్టు వదలని విక్రమార్కుడు అనొచ్చేమో! మరి ఇతడెవరో గుర్తుపట్టారా? లేదా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు చిత్రసీమలో హీరోల, నిర్మాతల కొడుకులు, కూతుళ్లు కూడా ఇండస్ట్రీలోకి వస్తుంటారు. హీరోలు, ప్రొడ్యూసర్ గా హిట్స్ కూడా కొడుతుంటారు. అలాంటి కాంబోనే పైన కనిపిస్తున్న చిన్నారులు. వాళ్ల పేర్లు నితిన్-నిఖితా. ఈ ఇద్దరూ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి వారసులు. ‘జయం’ మూవీతో నితిన్ గా హీరోగా మారిపోయాడు. నిఖిత.. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ తో నిర్మాతగా మారింది. ఇలా ఎవరికివాళ్లు ఇండస్ట్రీలో ఫేమ్, క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం చాలానే పేరు తెచ్చుకున్నారు.
కెరీర్ ప్రారంభంలో జయం, దిల్, సై లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన నితిన్.. ఆ తర్వాత ఏకంగా 13 సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్నాడు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా దండయాత్ర చేస్తూ వచ్చాడు. ఫైనల్ గా ‘ఇష్క్’తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆడపాదడపా హిట్స్ కొడుతూ, ఫ్లాప్స్ అందుకుంటూ కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం తనకు ‘భీష్మ’తో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో మరో సినిమా చేస్తున్నాడు. ఇది షూటింగ్ దశలో ఉంది. సరే ఇదంతా పక్కనబెడితే.. పైన చిన్నారుల ఫొటో చూడగానే మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.