నటి షాలిని తనకు విడాకులు మంజూరు అయిన తర్వాత విడాకుల ఫొటో షూట్ ఏర్పాటు చేశారు. ఆ ఫొటో షూట్ తాలూకా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రముఖ తమిళ నటి షాలిని విడాకుల ఫొటో షూట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఘనంగా విడాకుల ఫొటో షూట్ నిర్వహించారు. ఆ ఫొటోల్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. వైరల్‌గా మారిన ఫొటోలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. ఆమెను సపోర్టు చేస్తూ కొందరు.. తిడుతూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఎవ్వరూ ఆమె అలా చేయటానికి గల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నిజానికి ఆమె అలా చేయటం వెనుక బలమైన కారణం ఉంది.
వైవాహిక జీవితంలో నాలుగేళ్ల నరకం అనుభవించిన ఆమె చివరకు భర్తతో విడిపోయారు. అన్నేళ్ల పాటు తాను పడ్డ కష్టాన్ని మర్చిపోవటానికి ఈ ఫొటో షూట్‌ను ఏర్పాటు చేశారు. భర్తతో తాను అనుభవించిన నరకం గురించి షాలిని మాట్లాడుతూ.. ‘‘ దుబాయ్‌లో ఉంటున్నాను.. దుబాయ్‌లో ఉంటున్నానని నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. దుబాయ్‌లో నా భర్త నన్ను కొట్టినపుడు పార్కింగ్‌లో వచ్చిపడుకునేదాన్ని. ఎందుకంటే.. అప్పటికి ఆ గొడవను అలా ఆపాలని చూసేదాన్ని. ఏం చేయాలో తెలీదు. మనం పోలీసుల దగ్గరికి వెళితే.. అతడి జీవితం నాశనం అవుతుంది. అందుకే నేను అడ్జెస్ట్ అయి.. కింద పార్కింగ్‌లోనే పడుకునేదాన్ని. తెల్లవారిన తర్వాత ఇంటికి వెళ్లేదాన్ని. 2019 వరకు నాలుగేళ్లు అతడితో దెబ్బలు తిన్నాను.
నేను ఇన్నేళ్లు తిన్న దెబ్బలు ఆరోజు తిరిగి ఇచ్చాను. అతడ్ని కొట్టాను. ‘నేను ఇన్ని రోజులు నా పిల్లల కోసం మర్యాద ఇస్తూ వచ్చాను. ఎప్పుడైతే నువ్వు నా పిల్లలు ఏడుస్తున్నా.. వారి ముందే నన్ను కొట్టావో.. ఇకపై ఇలాంటి తండ్రి వాళ్లకు అవసరం లేదు’ అని చెప్పాను. అతడ్ని కొట్టాను. ఆ రోజు నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్లిపో అన్నాడు. నేను చాలా ధైర్యంగా.. ‘నేను బయటకు వెళ్లిపోవటం కుదరదు. నేను అప్పుడు సింగిల్.. నువ్వు అనే సరికి వెంటనే సూట్ కేసు పట్టుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లే దాన్ని. ఇప్పుడు పోవటం కుదరదు. కుదిరితే నువ్వే వెళ్లిపో’ అని చెప్పాను’’ అంటూ తన కన్నీటి కథను చెప్పుకొచ్చారు.
Painful story behind the viral photo shoot 💔. Everyone are fighting their own problems, let’s not judge them by what we see or what we know. She deserves to be happy ❤️.#SpreadLove pic.twitter.com/BDiJJUfd4J
— Vidya (@VidyaV007) May 2, 2023