ఇప్పటికే సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన తెలుగు సినిమా పరిశ్రమను మరో విషాద వార్త బాధిస్తుంది. ఎస్‌ఆర్ కళ్యాణ మండపం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అబ్బవరం కిరణ్.. ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోయాడు. ఆయన సోదరుడు రామాంజులు రెడ్డి బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంకా ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.