యంగ్ హీరో కిరణ అబ్బవరం మరోసారి రెచ్చిపోయాడు. ఇండస్ట్రీలో నెపోటిజంపై స్పందించడంతో పాటు అసలేం జరుగుతుందో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
ఒకప్పటితో పోలిస్తే తెలుగులో చాలామంది హీరోలు వస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ హవా పెరిగిన తర్వాత ఆ నంబర్ ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి. అలా వచ్చిన వారిలో ‘కిరణ్ అబ్బవరం’ ఒకడు. పక్కింటి కుర్రాడిలా కనిపించే ఇతడు ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం ట్రోలర్స్ ఫుల్ సీరియస్ అయ్యాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య కాలంలో కొందరు హీరోల సినిమా రిలీజ్ అవడమే లేటు.. సోషల్ మీడియాలో సదరు మూవీపై విమర్శలు చేసేవాళ్లు కనిపిస్తుంటారు. అయితే చాలామంది వాటిని పట్టించుకోనట్లు వదిలేస్తుంటారు. కిరణ్ అబ్బవరం మాత్రం అలా చేయకుండా వాళ్లకు కౌంటర్ ఇచ్చాడు. తన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ విషయంలో జరిగిన దాన్ని పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. తనని మాత్రం ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆ వీడియో కాస్తవైరల్ గా మారింది. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
‘నా గత సినిమాలకు మీరిచ్చిన ఫలితం నేను కాదనలేను. నేను చేసిన సినిమాలు అలా ఉన్నాయేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ‘వినరో భాగ్యము విష్ణుకథ’ విషయంలో మాట్లాడొచ్చు అనుకుంటున్నాను. ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరించారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు గానీ కొన్ని బ్యాచులు ట్విట్టర్ తెరవగానే కనిపిస్తున్నాయి. ‘నీ సినిమా బాగోలేదు’ అని పుణె నుంచి ఒకడు మెసేజ్ పెడతాడు. పుణెలో ఉన్నవాడు నా సినిమా ఎలా చూస్తాడు? ఇలా ట్రోల్ చేసేవారి వివరాలు చూస్తుంటే ఇక్కడివారు కాదని తెలుస్తోంది. మీరేం చేసినా ఇక్కడే ఉంటాను. నెపోటిజం ఇండస్ట్రీలో లేదు. సోషల్ మీడియాలో ఇలా ఫేక్ ప్రచారం చేసేవారే నెపోటిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇలా చేస్తే.. నా లాంటి యంగ్ హీరోలు ఇండస్ట్రీలో ఎలా ఎదుగుతారు చెప్పండి. అలానే ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే డబ్బులు తిరిగొచ్చేశాయి.’ అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.