ఇండియన్ ఐడల్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న మాట వాస్తవమే. తెలుగు సింగర్స్ కూడా చాలా మంది ఇండియన్ ఐడల్ టైటిల్ సాధించి మన సత్తా చాటారు. అయితే ప్రస్తుతం తెలుగు అభిమానుల కోసం తెలుగు ఇండియన్ ఐడల్ ప్రారంభం చేసిన విషయం తెలిసిందే. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో తెలుగు ఇండియన్ ఐడల్ స్ట్రీమ్ అవుతోంది. ఈ వారం డబుల్ ధమాకా అని స్పెషల్ ఎపిసోడ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సింగర్ శ్రావణ భార్గవితో కలిసి కంటెస్టెంట్ మారుతీ ‘ఏవండోయ్ నానీ గారు చెప్పండోయ్ చిన్నిగారు’ పాట పాడాడు. ఆ పాటకు సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: బాలీవుడ్ ని వణికిస్తున్న టాప్-10 సౌత్ ఇండియన్ స్టార్స్ వీరే!
అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. మారుతీ, శ్రావణ భార్గవీ పాడిన ఆ పాట జడ్జిమెంట్ విషయంలో జడ్జెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ముగ్గురు జడ్జెస్ లో కార్తిక్, నిత్యా మేనన్.. మారుతీ పాట బాగుందని కితాబివ్వగా.. తమన్ మాత్రం వారితో విభేదించాడు. తెలుగు ఇండియన్ ఐడల్ లో ఇది నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ కార్తిక్ చెప్పగా.. తమన్ మాత్రం ఇది ఈ సీజన్ మొత్తంలో నీ బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ అంటూ షాకిచ్చాడు. అంతేకాకుండా తమన్- నిత్యామీనన్ మధ్య కాసేపు వాతావరణం వేడెక్కింది. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఏం లేదు అని తమన్ కుండబద్దలు కొట్టేశాడు. అయితే ఇది రియల్ జడ్జిమెంటా? లేక చివర్లో తమన్ హే ఇట్స్ ఏ ప్రాంక్ అంటాడా అనేది వేచి చూడాల్సి ఉంది. తమన్- నిత్యామేనన్ మధ్య విభేదాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.