Resul Pookutty: సినీ ఇండస్ట్రీలో సినిమాలపై విమర్శలు రావడం అనేది సర్వసాధారణం. సినిమాలో అది లేదు.. ఇది లేదంటూ విమర్శిస్తూనే ఉంటారు. అయితే.. సినిమా బాగుంది బాగాలేదు అనడం వేరు. కానీ.. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ అందుకొని, 1000కోట్లకు పైగా వసూల్ చేసిన RRR మూవీపై ‘గే లవ్ స్టోరీ’ అని, ఆస్కార్ గెలిచిన ఇండియన్ కామెంట్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
RRR మూవీపై ఎందరో విమర్శలు గుప్పించారు.. అయినా సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. అయితే.. ఆర్ఆర్ఆర్ పై విదేశాల వారు కామెంట్స్ చేశారంటే ఓకే.. ఎవరి అభిప్రాయాలు వారివేనని వదిలేయొచ్చు. కానీ.. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని సామెతను వినే ఉంటారు. ఇప్పుడున్న రోజుల్లో నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే ఎదుగుదలకు అంత మంచిదని చెబుతుంటారు.
ఈ విషయంలో ప్రముఖ సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి లిమిట్ క్రాస్ అయ్యాడని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇటీవలే RRR మూవీపై ‘గే లవ్ స్టోరీ’ అని ట్వీట్ చేసి చర్చల్లోకెక్కిన సంగతి తెలిసిందే. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఇండియా నుండి ఆస్కార్ అవార్డు అందుకున్న రసూల్.. తెలుగు సినిమాపై ఇలాంటి కామెంట్ చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు నెటిజన్స్. ఇప్పటికే రసూల్ ట్వీట్ పై పలువురు ప్రముఖులు సీరియస్ అయ్యారు.
తాజాగా రసూల్ చేసిన ట్వీట్ ఎఫెక్ట్ అతని కెరీర్ పై ప్రభావం చూపేలా ఉందని టాక్. తెలుగులో ఇటీవల పుష్ప, రాధే శ్యామ్, అరణ్య సినిమాలకు సౌండ్ ఇంజనీర్ గా పనిచేశాడు రసూల్. ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం పని చేస్తున్నాడట. ఇక ఇటీవల RRR పై చేసిన కామెంట్ కారణంగా రసూల్ ని ‘పుష్ప 2’ నుండి మేకర్స్ తొలగించినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే పుష్ప మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందేనని సమాచారం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Gay love story ….
— resul pookutty (@resulp) July 3, 2022
#RemoveResul from Pushpa-2.Resul Pookutty lacks basic decency and he cannot be allowed to work in Telugu after his derogatory remarks on RRR and Rajamouli.
Sukumar and DSP have to take immediate action and remove him @Mirchi9 @Telugu360 @ThisIsDSP @MythriOfficial @RRRMovie— Rudra (@Rudra9001) July 5, 2022