హంసానందిని.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్. పుట్టి పెరిగింది మహారాష్ట్రలోనే అయినప్పటికీ కెరీర్ పరంగా ఎక్కువ తెలుగు సినిమాలే చేసింది. ఈ బ్యూటీ సినీ రంగంలో అడుగుపెట్టి దాదాపు 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల కెరీర్ లో హంసానందిని హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. కానీ ఒక్కసారి కూడా స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరలేకపోయింది.
డార్లింగ్ ప్రభాస్ సరసన మిర్చి లాంటి కుర్రాడే అంటూ మిర్చి సినిమాలో ఆడిపాడి వేడి పుట్టించిన హంసా.. తెలుగులో ఐటెం సాంగ్స్ కి హాట్ ఫేవరేట్ గా మారింది. స్పెషల్ సాంగ్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ భామలో చక్కగా ఇమిడి ఉన్నాయి. అంతకుమించి అందం కూడా ఉండటంతో ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ తోనే సూపర్ క్రేజ్ దక్కించుకుంది. మోడలింగ్ చేసి సినిమాల్లోకి వచ్చిన హంసా.. ప్రస్తుతం సినీ అవకాశాలు లేక మోడలింగ్ నే నమ్ముకుంది.
ఇటీవల హంసా నందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. గ్రేడ్ 3 క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ప్రస్తుతం హంసాకి కీమోథెరపీ జరుగుతుంది. అయితే.. ఓవైపు చికిత్స తీసుకుంటూనే హంసా ఫోటోషూట్ చేసి ఫోటోలను ఆమె స్టైలిస్ట్ పోస్ట్ చేసింది. కానీ ఫోటోలలో గుండుతో ఉండటం గమనించవచ్చు.
హంసా ఫోటో పోస్టు చేస్తూ.. ‘మీ బలం, నమ్మకం, అందాన్ని ఈ ఫోటోలో కనిపిస్తుంది. క్యాన్సర్ తో మీరు చేస్తున్న ఈ పోరాటం మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. మీరు దీన్నుంచి విజయవంతంగా బయటకు వస్తారు. ఎప్పటికీ మేమంతా మీతోనే ఉంటాం ” అంటూ స్టైలిస్ట్ అమీ పటేల్ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం నెట్టింట హంసానందిని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి హంసానందిని కొత్ ఫోటోషూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.