ఇటీవలే తాను తల్లి కాబోతున్నానంటూ చిన్నారి డ్రెస్ తో సోషల్ మీడియాలో వెల్లడించింది గోవా బ్యూటీ ఇలియానా. తాజాగా బేబి బంప్ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇలియానా.. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు ఈ గోవా బ్యూటీ పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన ఈ భామ.. ఆ తరువాత మహేష్ బాబు పోకిరి సినిమాతో యూత్ క్రష్ మారింది. ఇలియాన్ అందానికి యువత దేవదాసులుగా మారారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంతాల తన అందంతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఇటీవలే తాను తల్లి కాబోతున్నానంటూ చిన్నారి డ్రెస్ తో సోషల్ మీడియాలో వెల్లడించింది. తాజాగా బేబి బంప్ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొన్నాళ్ల క్రితం ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఎంతలా అంటే దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఈ గోవా బ్యూటే ఉండేది. టాలీవుడ్ లో కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతోనూ జతకట్టిన ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే సడెన్ గా టాలీవుడ్ లో పుల్ స్టాప్ పెట్టేసి బాలీవుడ్ కు మకాం మారింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో ఈ అమ్మడు విజయం సాధించలేదు.
దీంతో కొంతకాలం వెండితెరపై కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఫుల్ యాక్టీవ్ గా ఉటుంది. తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది. అలానే తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుటుంది. ఇటీవలే ఇలియానా.. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే గర్భవతినని ఈ బ్యూటీ అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అదే షాక్ అంటే తాజాగా మరో షాక్ ఇచ్చింది. తొలిసారిగా తన బేబీ బంప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక మరోవైపు ఈ గోవా బ్యూటీ ప్రెగ్నెన్సీ అని ప్రకటన చేసినప్పటి నుంచి నెటిజన్లు ఫుల్ సెటైర్లు వేస్తున్నారు. అలానే ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ఈ బ్యూటీ సహజీవనం చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాదు, వీరిద్దరు కత్రినా, విక్కీలతో కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారు. ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టినా ఇలి బేబి.. ఇంతవరకు తన రిలేషన్ షిప్ స్టేటస్ మాత్రం రివీల్ చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైన ప్రస్తుతం ఆ గోవా బ్యూటీ బేబి బంప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.