మోసపోయేవాడు ఉన్నంత కాలం.. మోసం చేసేవాళ్లు ఉంటారు. సామాన్యులు, నిరక్షరాస్యులు మాత్రమే కాక మోసపోయే వారి జాబితాలో సెలబ్రిటీలు కూడా ఉంటారు. తాను కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాను అంటోంది గుప్పెడంత మనసు రిషి సార్ పెద్దమ్మ దేవయాని అలియాస్ మిర్చి మాధవి. ఆ వివరాలు..
మిర్చి మాధవి అంటే చాలా మంది వెంటనే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి సార్ పెద్దమ్మ దేవయాని అంటే.. తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తు పడతారు. ప్రస్తుతం బుల్లితెర మీద టాప్ సీరియల్‌గా దూసుకుపోతుంది గుప్పెడంత మనసు సీరియల్. రిషిధారల క్యూట్ లవ్ స్టోరికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సీరియల్‌లో వసు, రిషి, మహేంద్ర, జగతిలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది దేవయాని అలియాస్ మిర్చి మాధవి. విలనిజాన్ని పండిచండంలో తన రూటే సెపరేటు అన్న స్థాయిలో దేవయాని పాత్రలో జీవించింది. అయితే ప్రస్తుతం క్రితం మిర్చి మాధవి.. ఈ సీరియల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె కుటుంబం మొత్తం యూకేలో సెటిల్ అవ్వడంతో మాధవి కూడా అక్కడికే వెళ్లారు. ఫలితంగా ఆమె గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకుంది.
సీరియల్‌లో కుట్రలు, మోసాలు పన్నే క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించిన మిర్చి మాధవి.. నిజ జీవితంలో మాత్రం ఓ వ్యక్తిని నమ్మి భారీగా మోసపోయిందట. రియల్ లైఫ్‌లో తానే ఓ వ్యక్తి చేతిలో ఆర్ధికంగా భారీగా మోసపోయిన విషయాన్ని తెలియజేసింది మిర్చి మాధవి. తాను నమ్మిన వ్యక్తి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటే దాదాపు రూ.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టానని.. అయితే ఆ వ్యక్తి తనని మోసం చేసి.. ఆ మొత్తం కాజేశాడని తెలిపింది. స్టాక్ మార్కెట్ గురించి తనకి సరిగా అవగాహన లేకపోవడంతో.. ఆ వ్యక్తి తనను ఎంతో సులువుగా మోసం చేశాడని చెప్పుకొచ్చింది.
అయితే డబ్బు పోవడం కంటే.. తనకి తెలిసిన వ్యక్తే ఇలా మోసం చేయడం తనని అన్నింటి కంటే ఎక్కువగా బాధించిందని వాపోయింది మిర్చి మాధవి. అంతేకాక షేర్ మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఇతరుల మాటలు నమ్మి.. దానిలో డబ్బులు పెడితే.. విపరీతమైన లాభాలు వస్తాయని ఆశపడే వాళ్లకి తనకు ఎదురైన అనుభవం ఓ గుణపాఠం అని చెప్పుకొచ్చింది. ప్రసుత్తం గుప్పెడంత మనసు సీరియల్‌లో మిర్చి మాధవి ప్లేస్‌లో సంగీత కొండవీటి అనే సీనియర్ నటిని తీసుకుని వచ్చారు. కానీ ప్రేక్షకులు మాత్రం రిషి సార్ పెద్దమ్మ అంటే మిర్చి మాధవే.. ఆమెను తప్ప.. ఆ క్యారెక్టర్‌లో వేరే వారిని ఊహించుకోలేకపోతున్నాం.. మిస్ యూ మేడం.. మీరు మళ్లీ సీరియల్‌లోకి రావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మిర్చి మాధవి.. ‘గుప్పెడంత మనసు’తో పాటు.. చాలా సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలానే సిల్వర్ స్క్రీన్ మీద కూడా అనేక సినిమాల్లో నటించింది. మరీ ముఖ్యంగా ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘మిర్చి’లో ఆమె పాత్రకు మంచి మార్కులు పడటమే కాక.. మిర్చి మాధవిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత.. ఆమె 100 % లవ్, శతమానం భవతి, గద్దలకొండ గణేష్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మరి మిర్చి మాధవికి ఎదురైన అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.