సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్ సినిమాలతో అక్కడి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అలాంటి ఆమెపై ఓ నటుడి ప్రేమని వ్యక్తపరిచాడు.
తెలుగు సినీఇండస్ట్రీలో సాయిపల్లవికి చాలా క్రేజ్ ఉంది. ఆమె నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. సాయిపల్లవి అనగానే తెలుగు ప్రజలకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘ఫిదా’. ఈ మూవీతో అందరినీ స్పెల్ బౌండ్ చేసి, మనసులను గెలుచుకున్న ఈమెకి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకత గుర్తింపు వచ్చింది. నో మేకప్, నో ఎక్స్ పోజింగ్.. దుమ్ము దులిపే డాన్స్‌తో నాతో నాకే పోటీ అన్న స్థాయికి ఎదిగిపోయింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న మనస్తత్వంతో అందరి మనసుల్ని గెలుచుకుంటోంది. హిట్లు వచ్చినపుడు పొంగిపోకుండా.. ఫ్లాప్స్ వచ్చినపుడు కృంగిపోకుండా ఒకేలా ఉంటోంది. అలాంటి ఈమెపై ఓ ప్రముఖ నటుడు లవ్ ఉందని బయటపెట్టాడు.
తన సొంత ప్రతిభతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సొంత చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వెళ్లింది. తాజాగా ఓ బాలీవుడ్ నటుడు.. సాయిపల్లవి అంటే చాలా ఇష్టమని, ఆమె తన క్రష్ అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఎవరా నటుడు? అన్న వివరాలలోకి వెళితే.. బాలీవుడ్‌లో గుల్షన్ దేవయ్యకు నటుడిగా ఓ మంచి గుర్తింపు ఉంది. విభిన్నమైన పాత్రలు చేస్తూ అతడు బాలీవుడ్ ప్రేక్షలకు మనసు గెలుచుకుంటూ ఉన్నాడు. రీసెంట్ గానే ‘దహాద్’ అనే వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ని పలకరించాడు.
సౌత్ బ్యూటీ సాయిపల్లవిపై ఈ నటుడు మనసు పారేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంట్రర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు హీరోయిన్ సాయిపల్లవి అంటే చాలా ఇష్టమని, ఆమె తన క్రష్ అని చెప్పుకొచ్చాడు. ఆమె అందం యాక్షన్ , డాన్స్‌కు ఫిదా అయిపోయానని, సాయిపల్లవి మొబైల్ నెంబర్ తన వద్ద ఉన్నా ఈ విషయం ఆమెకు చెప్పే ధైర్యం చేయలేకపోయానని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సాయిపల్లవితో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని గుల్షన్ దేవయ్య ఆమెపై అభిమానం వ్యక్తపరిచారు. మరి నిజంగానే అంతలా ప్రేమిస్తున్నాడా, లేకపోతే వీరి అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారిపోయింది. మరి ఈ నటుడు చెప్పిన దానిపై మీరేం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.