సాయధరమ్ తేజ్ బంజారాహిల్స్ రోడ్డు నెం 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మొదట ఆయన్ని మెడికేర్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి తర్వాత అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అపోలో వైద్య శిబిరాలు ఆయనకు మెరుగైన ట్రీట్‌మెంట్ అందిస్తూ అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. అయితే రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్.. ఆసుపత్రి నుంచి ట్విట్టర్ వేదికగా తన థంబ్ చూపిస్తూ.. పోస్ట్ పెట్టడంతో ఆయన అభిమానుల్లో ఆశలు చిగురించాయి.
సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ఆసుపత్రి లో ఉండి తిలకించినట్లు సమాచారం. రిపబ్లిక్ మూవీకి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్ చేశారు సాయిధరమ్ తేజ్. దీంతో త్వరలోనే ఆయన ఆసుపత్రి నుంచి బయటకు రానున్నారని అంతా ఫిక్సయ్యారు. తమ అభింమాన హీరో కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి సాయి ధరమ్ తేజ్ హెల్త్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా తేజ్ హెల్త్ విషయమై మెగా బ్రదర్ నాగబాబు అప్డేట్ ఇచ్చారు. తేజ్ ఆరోగ్యం బాగుంది. రిహాబిలిటేషన్, ఫిజియోథెరపీ జరుగుతున్నాయి. ప్రమాదం జరిగినపుడు షోల్డర్ ఫ్యాక్చర్ కావడంతో రెండు సార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని.. ప్రస్తుతం అంతా బాగుందని అన్నారు.
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడని, ఫిజికల్ ఫిట్ రావడానికి మరికొన్ని రోజులు పట్టవొచ్చని నాగబాబు అన్నారు. రెండు నెలల్లో షూట్‌లకు కూడా హాజరు కావచ్చు. ఆసుపత్రి నుంచి డిశ్చార్ అయినా కూడా మరికొంత కాలం విశ్రాంతి తీసుకోమని మేము అతనికి సలహా ఇస్తున్నాము అని నాగ బాబు అన్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “రిపబ్లిక్” విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవ్ కట్టా దర్శకత్వం వహించగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది.