గాజువాక లేడీ కండక్టర్ ఝాన్సీ మళ్లీ డ్యాన్స్ తో చితక్కొట్టేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వరసగా మూడో వారం కూడా ఫుల్ ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. మాస్ ఐటమ్ సాంగ్ కి స్టెప్పులేసి.. స్టేజీని షేక్ చేసి పడేసినట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఫస్ట్ టైమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చిన ఝాన్సీ.. ఆ ఎపిసోడ్ లో ఠాగూర్ మూవీలోని ‘గప్పు చిప్పు’ సాంగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత వారం.. ‘నేను అట్టాంటి, ఇట్టాంటి ఆడదాన్ని కాదు బాబోయ్.. పల్సర్ బైక్ మీద రాను బాబోయ్..’ అని దుమ్మరేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. ఇక ఈ సాంగ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఇప్పుడు ఆ ఫెర్ఫార్మెన్స్ మించిపోయేలా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో మరోసారి దుమ్మురేపినట్లు కనిపిస్తోంది. తర్వాత వారం కోసం తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోయింది. ‘వెంటపడి వచ్చేవాళ్లు కుర్రాళ్లు..’ అనే ఐటమ్ సాంగ్ కి స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది. ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే.. ఇక ఫుల్ సాంగ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని నెటిజన్స్ అప్పుడే మాట్లాడేసుకుంటున్నారు. మరి కండక్టర్ ఝాన్సీ కొత్త సాంగ్ కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: 3 నెలలు గంజి అన్నం, ఆవకాయ తిని బతికాను : గాజువాక లేడీ కండెక్టర్