ఇప్పుడు సెలబ్రిటీలుగా ఉన్న వారంతా ఒకప్పుడు సామాన్యులే. వారు సామాన్యులుగా ఉన్నప్పుడు అవమానించే వారు ఉంటారు. ఆడవారినైతే ఇబ్బందులు పెట్టే ఉంటారు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారు ఉంటారు. ఇలాంటి చేదు అనుభవాలు, అవమానాలు జరిగినప్పుడు మాట్లాడలేని వారు సక్సెస్ వచ్చిన తర్వాత బయటపెడతారు. తాజాగా కండక్టర్ ఝాన్సీ తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. ఒక టైలర్ తన విషయంలో తప్పుగా ప్రవర్తించాడని ఆమె అన్నారు.
ఒక మంచి స్థాయికి రావాలంటే ఎన్నో దాటుకుని రావాలి. జీవితంలో చేదు జ్ఞాపకాలు, చేదు అనుభవాలు ఉంటాయి. ఈరోజు సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న వారు జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కునే ఉంటారు. ఒకప్పుడు అవమానాలు పొందిన వారే ఇప్పుడు అభిమానాలు పొందుతున్నారు. ఒకప్పుడు ఛీత్కారాలు పొందినవారే ఇప్పుడు సత్కారాలు పొందుతున్నారు. ‘సమాజం నిన్ను నిర్ణయించదు, సమాజాన్నే నువ్వు నిర్ణయిస్తావు’ అనే మాటను నిజం చేస్తూ ఎంతో మంది మన కళ్ళ ముందు ఎదిగారు. అలా ఎదిగిన వారిలో గాజువాక కండక్టర్ ఝాన్సీ ఒకరు.
గాజువాక కండక్టర్ ఝాన్సీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. సాధారణ బస్ కండక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. వీలున్నప్పుడల్లా తనలో ఉన్న డ్యాన్సర్ ని బయటకు తీసుకొచ్చి ఇవాళ డ్యాన్సర్ గా ఎదిగారు. పల్సర్ బైక్ సాంగ్ ద్వారా పాపులర్ అయిన ఝాన్సీ.. బుల్లితెర మీద పలు షోస్ లో డ్యాన్స్ చేసి సందడి చేస్తున్నారు. ఒక్క పాటతో ఆమె తెలుగు రాష్ట్రాలను షేక్ చేశారు. రవితేజ నటించిన ధమాకా సినిమాలో ఆ పాటను పెట్టేంతగా ప్రభావితం చేయగలిగారంటే ఆమె ఎంత కష్టపడ్డారో అర్ధమవుతోంది. చూసే జనానికి ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందని అనుకుంటారు. కానీ ఎన్నో ఏళ్ల కష్టం ఉంటుంది. ఇదే విషయాన్ని ఆమె వెల్లడించారు.
సూపర్ క్వీన్ సీజన్ 2 షోలో పాల్గొన్న ఝాన్సీ.. తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఒక టైలర్ తన పట్ల తప్పుగా ప్రవర్తించాడని ఆమె వెల్లడించారు. చాలా మంది ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందని అంటున్నారు. కానీ దాని వెనుక 18 ఏళ్ల కష్టం ఉందని కండక్టర్ ఝాన్సీ వెల్లడించారు. ఒకసారి తాను టైలర్ షాప్ కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో తన తండ్రి లేరని.. టైలర్ షాప్ వ్యక్తి కొలిచే కొలతల్లో తప్పు ఉందని ఆమె అన్నారు. తన తండ్రితో చెప్పి టైలర్ ను కొట్టిద్దామని అనుకున్నానని, కానీ అదే నాన్న వచ్చి నేను నీ తండ్రిని కాదని చెప్పు అన్నారని చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 9న ప్రసారం కానున్న ఈ షోకి అతిథిగా కాజల్ అగర్వాల్ వచ్చారు. మరి గాజువాక కండక్టర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.